Chinese EV cars : చైనాకు చెందిన BYD కంపెనీ ఇటీవల దక్షిణ కొరియా ( South Korea) ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాన్ని Passenger electric vehicle (EV) మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారు ద్వారా చైనాకు వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉందని పారిశ్రామిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చైనాకు డ్రైవర్ డేటా బదిలీ
గత నెలలో BYD అధికారికంగా దక్షిణ కొరియా ప్యాసింజర్ వాహన మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత డేటా చైనాకు లీక్ అయ్యే భద్రతా ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. BYD ప్రారంభించిన మొదటి మోడల్ Atto 3 కనెక్టెడ్ కార్ ఫీచర్లు కలిగి ఉంది. వీటి ద్వారా సున్నితమైన డ్రైవర్ డేటా చైనాకు బదిలీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సూన్‌చున్‌హ్యాంగ్ విశ్వవిద్యాలయం సైబర్‌సెక్యూరిటీ ప్రొఫెసర్ ఎమిరిటస్ యోమ్ హియుంగ్-ఇయోల్ మాట్లాడుతూ BYD ఏ రకమైన డేటాను సేకరిస్తుంది.. ఎలా ప్రాసెస్ చేస్తుంది? అనే విషయాలను ఆ కంపెనీ కచ్చితంగా వెల్లడించాల్సిందేనని అంటున్నారు. వినియోగదారులు తమ వ్యక్తిగత డేటా సేకరణ ఇవ్వడానికి ఆప్ట్ ఆఫ్ మెకానిజం ద్వారా నిరాకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
Chinese EV cars : చైనాకు డేటా బదిలీ చెయ్యం : బీవైడీ కంపెనీ
వ్యక్తిగత డేటా రక్షణపై BYD కంపెనీ స్పందించింది. వ్యక్తిగత డేటా భద్రత (Cyber security)పై కొరియా వినియోగదారుల ఆందోళనలను తాము పూర్తిగా అర్థం చేసుకుంటున్నామని పేర్కొంది. వ్యక్తిగత సమాచారం రక్షణ చట్టాన్ని కచ్చితంగా పాటిస్తున్నామని స్పష్టం చేసింది. దక్షిణ కొరియాలో సేకరించిన డేటా స్థానికంగా నిర్వహించబడుతుందని, చైనాలోని BYD ప్రధాన కార్యాలయానికి షేర్ చేయబడదని పేర్కొంది. అదేవిధంగా DeepSeek అనే చైనా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవను తమ వాహనాల్లో సమీకరించడానికి BYD కి ఎలాంటి ప్రణాళికలు లేవని ఆ కంపెనీ స్పష్టం చేసింది. అయితే.. చైనా EV తయారీదారు గీలీ ఇటీవల DeepSeek AI మోడల్‌ను తమ వాహనాల్లో సమీకరించడానికి ప్రణాళికను ప్రకటించడం గమనార్హం.
ఆటోమోటివ్ రంగంలో పోటీ పడేందుకు..
దక్షిణ కొరియా మార్కెట్లో BYD ప్రవేశం స్థానిక ఆటోమోటివ్ దిగ్గజాలతో నేరుగా పోటీ చేయడాన్ని సూచిస్తుంది. కంపెనీ గతంలో జపాన్ ప్యాసింజర్ కార్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. టయోటా, హోండా, నిస్సాన్ వంటి కంపెనీల హోమ్ మార్కెట్లో పోటీకి దిగింది. BYD 2024లో 4,272,145 నూతన శక్తి వాహనాలను విక్రయించింది. ఇది సంవత్సరానికి 41.26 శాతం వృద్ధిని సూచిస్తుంది. 2024లో కంపెనీ 417,204 యూనిట్లను విదేశాల్లో విక్రయించింది. ఇది 2023తో పోలిస్తే 71.86 శాతం వృద్ధిని సూచిస్తుంది.
BYD గ్రూప్ 2025లో మొత్తం 5.52 మిలియన్ యూనిట్లను విక్రయించొచ్చని, ఇది సంవత్సరానికి 29 శాతం వృద్ధిని సూచిస్తుందని డాయిచే బ్యాంక్ నివేదికలు చెబుతున్నాయి. 2025లో BYD (Chinese EV cars) విదేశీ మార్కెట్లలో విక్రయాలు 800,000 యూనిట్లుగా ఉండొచ్చని, ఇది సంవత్సరానికి 92 శాతం వృద్ధిని సూచిస్తుందని పేర్కొంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..