Sarkar Live

UK’s crackdown | ఇక యూకే వంతు.. అమెరికా తరహాలో అక్రమ వలసదారులపై క‌ఠిన చ‌ర్య‌లు షురూ..

UK’s crackdown : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అక్రమ వలసదారులపై ఆయన ప్రభుత్వం సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. సైనిక విమానాల ద్వారా అక్ర‌మ వల‌స‌దారుల (illegal migrants)ను త‌మ

UK's crackdown

UK’s crackdown : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అక్రమ వలసదారులపై ఆయన ప్రభుత్వం సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. సైనిక విమానాల ద్వారా అక్ర‌మ వల‌స‌దారుల (illegal migrants)ను త‌మ దేశం నుంచి త‌ర‌లించ‌డం మొద‌లెట్టింది. తాజాగా యూకే (United Kingdom) కూడా అదే బాట‌ప‌ట్టింది. అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను త‌మ దేశం నుంచి పంచేందుకు అమెరికా అవ‌లంబించిన విధానాన్నే అనుస‌రిస్తోంది. అక్రమంగా వ‌ల‌స వ‌చ్చిన వారిని గుర్తించి నిర్బంధంగా తిరిగి పంపేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అక్క‌డున్న రెస్టారెంట్లు, ఇత‌ర ప్ర‌దేశాల్లో యూకే హోంశాఖ ముమ్మ‌రంగా త‌నిఖీలు (raids) చేప‌డుతోంది. త‌ద్వారా వలసదారులను గుర్తించి తిరిగి పంపే ప్ర‌క్రియ మొద‌లెట్టింది.

ఎక్కువ మంది భార‌తీయులే..

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది యూకేకు వ‌ల‌స వెళ్లి అక్క‌డి రెస్టారెంట్ల (Indian Restaurants)లో ప‌నిచేస్తుంటారు. భారతదేశం నుంచే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ త‌దిత‌ర దేశాల వారు ఇలా అక్రమంగా వ‌ల‌స‌లు వెళ్తున్నారు. యూకేలోని రెస్టారెంట్లలో చాలా వ‌ర‌కు పాకిస్తాన్ వాసుల నిర్వ‌హ‌ణ‌లో న‌డుస్తుంటాయి. వాటిలో ఎక్కువ సంఖ్య‌లో భార‌తీయులు పనిచేస్తున్నారు. ఈ వలసదారులను వెన‌క్కి పంపేందుకు యూకే ప్రభుత్వం నిర్ణ‌యించిం విస్తృతంగా త‌నిఖీలు చేప‌డుతోంది. త‌మ అదుపులోకి వ‌చ్చిన వారిపై ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ క‌ఠినంగా వ్య‌వ‌హరిస్తోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

UK’s crackdown.. కొత్త చ‌ట్టాలు

ఈ అక్రమ వలసదారుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు (UK’s crackdown) దెబ్బతింద‌ని యూకే భావిస్తోంది. దీంతో వారిని తమ దేశం నుంచి పంపించేందుకు పూనుకుంది. ఇప్ప‌టికే అక్ర‌మంగా ఉంటున్న వారిని త‌ర‌లించ‌డ‌మే కాకుండా కొత్త‌గా మ‌ళ్లీ ఆ ప‌ద్ధ‌తిలో వ‌ల‌స రాకుండా కొత్త‌గా చ‌ట్టాల‌ను రూపొందిస్తోంది. అనేక దేశాలతో కలిసి సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహిస్తూ అక్రమ వలసలపై అవగాహన కల్పిస్తోంది. ముఠాలు, మానవ రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయాలని యూకే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?