Bhadradri Kothagudem | తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. అల్లుడిపై అత్తామామలు (in-laws) పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా ఇలా కోల్పోవాల్సి వచ్చింది.
పెద్దలను ఎదురించి.. పెళ్లి చేసుకొని..
పాల్వంచ మండలం (Paloncha mandal) దంతలబోరు గ్రామానికి చెందిన ఏళ్ల బాల్లెం గౌతమ్ (24) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండే వాడు. మూడేళ్ల క్రితం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు కావ్యతో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించగా ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదురించి గౌతమ్, కావ్య వివాహం చేసుకున్నారు. వీరిద్దరు (couple) కొత్తగూడెం మండలం సుజాతనగర్‌లో కాపురం పెట్టారు. వీరి దాంపత్య జీవితంగా సాఫీగానే సాగుతుండగా కొన్ని రోజుల తర్వాత మనస్పర్థలు ఏర్పడ్డాయి. అవి కాస్త ఎక్కువై గొడవలకు దారి తీశాయి. ఈ క్రమంలో కావ్య తన పుట్టింటి (maternal home)కి వెళ్లిపోయింది. ఐదు నెలలుగా తల్లిదండ్రులతో ఉంటూ భర్తతో దూరంగా ఉంటోంది.
Kothagudem Murder Case : భార్యను పంపమని అడిగితే..
భార్యను కాపురానికి రమ్మని గౌతమ్ కోరినా ఆమె ససెమిరా అంది. దీంతో ఫిబ్రవరి 2న రాత్రి 12 గంటల సమయంలో అత్తవారింటికి వెళ్లాడు. కావ్యను కాపురానికి పంపమని అత్తామామలను కోరాడు. ఇందుకు వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో గౌతమ్‌కు, అతడి అత్తామామల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అది తారస్థాయికి చేరుకోవడంతో కోపోద్రిక్తులైన అత్తామామలు గౌతమ్‌పై పెట్రోల్ (petrol )పోసి నిప్పంటించారు.
మృత్వువుతో పోరాడి, చివరకు..
మంటల్లో కాలిపోతున్న గౌతమ్ బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు నిద్రలోంచి లేచి వచ్చి చూడగా అప్పటికే అతడి శరీరం తీవ్రంగా కాలిపోయింది. దీంతో అతడిని అతడిని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి (MGM Hospital in Warangal)లో చేర్పించారు. చికిత్స అందుతున్న క్రమంలోనే గౌతమ్ ఈ రోజు తుది శ్వాస విడిచాడు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. గౌతమ్ మృతికి కారణమైన కావ్య కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








