Removes KCR birthday flex : బీఆర్ఎస్ (BRS ) ఫ్లెక్సీలు, జెండాల తొలగింపు హైదరాబాద్‌లో ఉద్రిక్తత (Tensions)కు దారి తీసింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జన్మదినం (KCR birthday) సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు వాటిని ఏర్పాటు చేయగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు తొలగించడం వాగ్వాదానికి దారి తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతోనే ఫ్లెక్సీలు, జెండాలను తొలగించారని బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు.
కేసీఆర్ జన్మదినం.. నగరమంతా గులాబీమయం
కేసీఆర్ (K Chandrashekhar Rao) జన్మదినం సందర్బంగా బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ (Hyderabad) అంతటా ఫ్లెక్సీలు (flex posters) జెండాలతో గులాబీమయం చేశారు. దీంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు GHMC, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది వాటిని తొలగించారు. ఈ చర్యలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోగా ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము ఈ పనిని చేస్తున్నామని, తమ విధుల్లో జోక్యం చేసుకోవద్దని సిబ్బంది ఖరాకండిగా చెప్పారు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, జెండాలను మాత్రమే నిబంధనల పేరుతో ఉద్దేశపూర్వంగా తొలగిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. పక్కనే ఉన్న బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను ముట్టుకోవడం లేదని, వారికి నిబంధనలు వర్తించవా? అని నిలదీశారు.
KCR birthday flex… సరైన చర్యే : కాంగ్రెస్
బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, జెండాలను జీహెచ్ఎంసీ తొలగించడంపై కాంగ్రెస్ నాయకులు సమర్థించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఆటంకం కలిగించేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని, దీంతో జీహెచ్ఎంసీ సరైన చర్యలే తీసుకుందని సమర్థించారు.
నెటిజన్లలో మిశ్రమ స్పందన
బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, జెండాలను తొలగించడం, ఆ సమయంలో వాగ్వాదం చోటుచేసుకోవడం లాంటి దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్ల (netizens)లో మిశ్రమ స్పందన వచ్చింది. నిబంధనలను అతిక్రమించడమే కాకుండా, దీనిపై రాద్ధాంతం చేయడం బీఆర్ఎస్‌కు తగదని పలువురు హితవు పలికారు. మరికొందరు రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, జెండాలను తొలిగిస్తోందని విమర్శించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..