Kollywood News | అంచనాలను తలకిందులు చేస్తూ కంగువ (kanguva) భారీ డిజాస్టర్ అయ్యింది. తరవాత సూర్య (surya)రెట్రో మూవీ కార్తీక్ సుబ్బరాజు (karthik subbaraj) డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ మూవీని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే (puja Hegde) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 1 న రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ మూవీ సెట్స్ పై వుండగానే మరో మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ (varun tej) తో తొలిప్రేమ టైటిల్ తో మూవీ చేశారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సరైన ఫలితం రాలేదు. ఈ టైటిల్ పై కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ఆయిన మూవీ టైటిల్ ను వాడుకోవడం అప్పట్లో పవర్ స్టార్ అభిమానులకు కొంతమందికి నచ్చలేదు. ఆ తరవాత అఖిల్ తో మిస్టర్ మజ్ను తీయగా అది కూడా డిజపాయింట్ చేసింది. నితిన్ తో రంగ్ దే వరకు కూడా వెంకీ సరైన హిట్టు కొట్టలేదు. తను తీసింది మామూలు సినిమాలే అయినా తమిళ్ హీరో ధనుష్ తను చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది వెంకీ మూవీ కెరీర్ ను టర్న్ చేసింది. అప్పటి వరకు తను తీసినట్టు కాకుండా డిఫరెంట్ స్టోరీ తో సార్ మూవీని తీశాడు. ఈ మూవీని ఆడియన్స్ ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్టు చేశారు. 100 కోట్లు కొల్లగొట్టి వెంకీని స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చిపెట్టింది. ఇక దుల్కర్ సల్మాన్ తో తీసిన లక్కీ భాస్కర్ ఏ రేంజ్ లో హిట్టు కొట్టిందో మనకు తెలిసిందే.
వెంకీకి మరో హిట్టు ఖాయమే..?
ప్రజెంట్ తను Surya తో చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ స్టోరీ కూడా వినిపించినట్టు సూర్యకు నచ్చడం తో త్వరలోనే మూవీ ప్రకటనను వెళ్లడించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కాంబో సెట్ అయితే వెంకీ అట్లూరి ఖాతాలో మరో బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. వెంకీ లైనప్ చూస్తుంటే తెలుగు హీరోలతో ఇప్పట్లో మూవీ చేయడేమో అనిపిస్తుంది. తన చూపు మొత్తం తమిళ్ హీరోల వైపే ఉంది. వారితోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు.
Surya Next Movie : వెంకీ అట్లూరి డైరెక్షన్లో నే ..
చాలా కాలం నుండి సూర్య (Surya) కూడా తెలుగులో ఓ మూవీ తీయాలనుకుంటున్నాడు. దీనికి వెంకీ అట్లూరి డైరెక్షన్లో నే కరెక్ట్ అనుకుని రంగం లోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.ఈ మూవీ హిట్టు అయితే ఇటు తెలుగు డైరెక్టర్ లతో సూర్య, అటు తమిళ్ హీరో లతో వెంకీ అట్లూరి బిజీ అయ్యే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్స్ (bhagya sri bhorse) నటిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబో పై మూవీ టీమ్ నుండి అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధిన విషయాలను వెల్లడించబోతున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








