Miss World beauty pageant : ప్రపంచ అత్యంత ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ (Miss World) పోటీలు (ఎడిషన్-72) తెలంగాణ (Telangana)లో జరగనున్నాయి. మే 7 నుంచి 31 వరకు నాలుగు వారాలపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇవి జరగనుండగా ప్రారంభ వేడుకతోపాటు గ్రాండ్ ఫినాలే హైదరాబాద్ (Hyderabad)లో జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీ 71వ ఎడిషన్‌ను న్యూ ఢిల్లీ, ముంబై, మహారాష్ట్రలో విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత మిస్ వరల్డ్ ఇప్పుడు తెలంగాణలో జరగనున్నాయి. మిస్ వరల్డ్ లిమిటెడ్ (Miss World Limited) సీఎండీ జూలియా మోర్లే సీబీఈ (Julia Morley CBE), తెలంగాణ టూరిజం, కల్చర్, హెరిటేజ్ అంట్ యూత్ అఫేర్స్ సెక్రటరీ స్మితా సబర్వాల్ ( Smita Sabharwal) ఈ మేరకు సంయుక్తంగా ప్రకటించారు.
తెలంగాణ సంస్కృతి అద్భుతం : జూలలియా మోర్లే
జూలియా మోర్లే మాట్లాడుతూ మిస్ వరల్డ్ 72వ ఎడిషన్‌ను తెలంగాణలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సమృద్ధి సంప్రదాయం, ఆవిష్కరణలు, అతిథి మర్యాదలకు తెలంగాణ ప్రసిద్ధి చెందిందని కొనియాడారు. ఇది అద్భుత వారసత్వం కలిగిన రాష్ట్రమని అన్నారు. ఇక్కడి డైనమిక్ అభివృద్ధిని ప్రభుత్వ సహకారంతో ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు ఈ పోటీలు దోహదపడతాయని తెలిపారు.
కేవలం మిస్ వరల్డ్ మహోత్సవాన్ని నిర్వహించడం వరకే కాకుండా సమాజాన్ని శక్తిమంతం చేయడం,, వైవిధ్యాన్ని సృష్టించడం తమ ధ్యేయమన్నారు.
తెలంగాణను ఎంచుకోవడం గర్వకారణం : స్మితా సబర్వాల్
స్మితా సబర్వాల్ మాట్లాడుతూ తెలంగాణలో 72వ మిస్ వరల్డ్ మహోత్సవాన్ని నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి మరింత చాటి చెప్పేందుకు ఈ పోటీలు దోహదపడతాయని అన్నారు.
Miss World beauty pageant : విశిష్టత ఏమిటంటే..
మిస్ వరల్డ్ పోటీలకు 1951లో అంకురార్పణ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌందర్య పోటీల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మహోత్సవం ఇది. దీని ద్వారా వివిధ దేశాల నుంచి వచ్చిన యువతులు తమ సౌందర్యం, ప్రతిభ, సామాజిక సేవా కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. 2025 మిస్ వరల్డ్ పోటీలు 2025 మే 31న హైదరాబాద్‌లోని గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది. ప్రస్తుత మిస్ వరల్డ్ కిరీటధారి, చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా ప్య్ష్కోవా, తన తరువాతి విజేతకు కిరీటాన్ని అందజేస్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








