Tesla entry in india : అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్‌లో ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దీని కార్యాచరణ ప్రారంభమైంది. వీలైనంత త్వరలోనే భారత్‌లో అడుగు పెట్టేందుకు టెస్లా ఉవ్విళ్లూరుతోంది. అయితే.. ఈ నిర్ణయంపై దేశీయ ఆటోమొబైల్ తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Tesla ప్రవేశం వల్ల పోటీ పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించే విధానం (EV policy)లో పలు మార్పులు చేయడానికి ప్రయత్నిస్తోంది.
చకచకా జరుగుతున్న పనులు
ప్రస్తుతం టెస్లా కంపెనీ పుణేలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) , ఢిల్లీలోని ఏరోసిటీలో తమ మొదటి షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి స్థలాలను వెతుకుతోంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ మార్కెట్ల కోసం 13 కొత్త ఉద్యోగాల కోసం ప్రకటనలు జారీ చేసింది. వీటిలొ బిజినెస్ ఆపరేషన్ అనలిస్ట్, సర్వీస్ టెక్నీషియన్, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్, ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి.
Tesla entry in india : అసంతృప్తిని వ్యక్తం చేసిన ట్రంప్
భారతదేశ EV మార్కెట్ 2030 నాటికి 40 శాతం పెనిట్రేషన్‌తో 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే టెస్లా కంపెనీ భారతదేశంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియాలో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం అమెరికాకు అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్య బేధాభిప్రాయాలకు దారి తీసింది. ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్చ ర్చల సమయంలో మాట్లాడుతూ అమెరికా వస్తువులపై ఉన్న సుంకాలను భారతదేశం తగ్గించకపోతే ప్రతిస్పందన సుంకాలను విధిస్తామని చెప్పారు.
తొలుత దిగుమతులతోనే సరి పెట్టుకొనే అవకాశం
ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని టెస్లా కంపెనీ తక్షణమే భారతదేశంలో తయారీ ప్రారంభించకపోయినా యూరోప్లోని బెర్లిన్ గిగా ఫ్యాక్టరీ నుంచి వాహనాలను దిగుమతి చేసుకొని స్థానికంగా విక్రయాలను క్రమంగా పెంచుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
Tesla entry in india : దేశీయ కొత్త విధానం
మరోవైపు టెస్లా కంపెనీ భారతదేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుండటంతో దేశీయ ఆటోమొబైల్ తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెస్లా ప్రవేశం వల్ల పోటీ పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం EV తయారీదారులను ఆకర్షించేందుకు పలు విధానాపరమైన మార్పులు చేస్తోంది. EV తయారీ సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కనీసం రూ. 4,150 కోట్ల పెట్టుబడిని పెట్టడం, మూడేళ్లల్లో ఉత్పత్తిని ప్రారంభించడం, మూడు సంవత్సరాల్లో 25 శాతం దేశీయ విలువను చేరుకోవడం, ఐదు సంవత్సరాల్లో 50 శాతం దేశీయ విలువను సాధించడం వంటి షరతులు విధించబోతోంది.
రాయితీలు పెంచే అవకాశం
సవరించిన EV విధానం కారు తయారీదారులు రెండో సంవత్సరంలోనే రూ. 2,500 కోట్ల టర్నోవర్‌ను చూపించాల్సిన అవసరం ఏర్పడొచ్చు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాల్లో మరింత రాయితీలు పెంచొచ్చు. సవరించిన EV విధానం మార్చి మధ్యలో ప్రకటించిన తర్వాత దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభమవుతుంది. ఆగస్టు నాటికి ఆమోదాలు ఇవ్వనున్నారు. అనంతరం దిగుమతులు ప్రారంభమవుతాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..