Sarkar Live

TGSRTC Digital payment | ఇక బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు

TGSRTC Digital payment system : తెలంగాణ (Telangana)లో బస్సు ప్రయాణం ఇక మరింత సులభం కానుంది. త‌మ వ‌ద్ద న‌గ‌దు లేక‌పోయినా ప్ర‌యాణికులు ఈజీగా టికెట్ (bus fares) కొనుగోలు చేయొచ్చు. ఇందుకు డిజిట‌ల్ చెల్లింపులు (Digital payment) విధానాన్ని

TGSRCT

TGSRTC Digital payment system : తెలంగాణ (Telangana)లో బస్సు ప్రయాణం ఇక మరింత సులభం కానుంది. త‌మ వ‌ద్ద న‌గ‌దు లేక‌పోయినా ప్ర‌యాణికులు ఈజీగా టికెట్ (bus fares) కొనుగోలు చేయొచ్చు. ఇందుకు డిజిట‌ల్ చెల్లింపులు (Digital payment) విధానాన్ని తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (TGSRTC) ప్ర‌వేశ‌పెడుతోంది. ఇప్పటికే కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా ఈ న‌గ‌దు ర‌హిత డిజిటల్ చెల్లింపులను అమల్లోకి తెచ్చింది. ఇది విజయవంతం కావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించేందుకు సిద్ధ‌మైంది.

హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా TGSRTC Digital payment system

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రధాన బస్ డిపోలలో పైలట్ ప్రాజెక్ట్‌గా డిజిటల్ చెల్లింపు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. దీని ద్వారా ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన వ‌చ్చింది. ఈ డిజిట‌ల్ పేమెంట్ విధానం (digital payment system) త‌మ‌కు కూడా ఎంతో సౌక‌ర్యంగా ఉంద‌ని ఆర్టీసీ కండ‌క్ట‌ర్లు తెలిపారు. టికెట్లు ఇస్తున్నప్పుడు సమయాన్ని ఆదా చేయడంలో ఇది ఎంతగానో సహాయపడిందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం లాంగ్-డిస్టన్స్ ఎయిర్ కండీషన్డ్ బస్సుల్లో QR కోడ్ ఆధారిత చెల్లింపు విధానం అందుబాటులో ఉంది. ఈ వ్యవస్థను మరింత విస్తరించడానికి ఆర్టీసీ చ‌ర్య‌లు చేప‌ట్టింది.

QR కోడ్ ద్వారా చెల్లింపులు

ప్రయాణికులు QR కోడ్ స్కాన్ చేసి, బ‌స్ టికెట్‌ను డిజిటల్‌గా చెల్లించే అవకాశం లభించనుంది. ఈ విధాన్ని ప‌రీక్షించ‌గా ఒక ట్రాన్స్‌సెక్ష‌న్‌కు సుమారు 30 సెక‌న్ల సమ‌యం ప‌డుతోంద‌ని టెక్నిక‌ల్ టీం గుర్తించింది. దీన్ని మరింత తగ్గించేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. RTC ఈ డిజిటల్ మార్పును పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు 10 వేల ఇంటెలిజెంట్ టికెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (i-TIMS) మిషన్లను కొనుగోలు చేయడానికి ఆర్టీసీ ప్రణాళిక వేసింది. మొదటి విడతలో 6 వేల‌ మిషన్లు ఇప్పటికే సమకూర్చ‌కుంది. ఈ టికెటింగ్ మిషన్లు టచ్‌స్క్రీన్ ఆధారంగా పని చేస్తుంది. దీనిపై RTC బస్ కండక్టర్లకు మూడు నెలల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రయోగాత్మకంగా అమలుచేసిన సమయంలో తలెత్తిన టెక్నికల్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

ముందుగా నగర బస్సుల్లో అమ‌లు

ఆర్టీసీ ప్ర‌వేశ‌పెడుతున్న i-TIMS మిషన్లను తొలుత నగర బస్సుల్లో అందుబాటులోకి తేనున్నారు. ఆ త‌ర్వాత జిల్లాల్లోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ వంటి నగరాల్లో ఈ వ్యవస్థ త్వరలో అమల్లోకి రానుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?