India imports Russian oil : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా భారత్ (India) పేరుగాంచింది. ఎక్కువ స్థాయి దిగుమతిదారు (importing nation)గా గుర్తింపు పొందింది. ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russian) దాడి చేసిన మూడో సంవత్సరంలో ఆ దేశం నుంచి భారత్ 49 బిలియన్ యూరోలు విలువైన ముడి చమురును కొనుగోలు చేసిందని తాజా నివేదికల ద్వారా వెల్లడైంది.
Russian oil : మధ్యప్రాచ్య దేశాల నుండి రష్యాకు మార్పు
ప్రధానంగా ముడి చమురును మిడిల్ ఈస్ట్ (Middle East) దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటూ వచ్చింది. అయితే 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా (Russian) దాడి చేసిన తర్వాత రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. రష్యా ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే భారీ డిస్కౌంట్‌తో లభించడమే ఇందుకు కారణం.
ఎక్కువ దిగుమతులకు కారణం ఏమిటంటే..
రష్యా చమురు (Russian oil) ను అమెరికా, యూరోపియన్ దేశాలు దిగుమతులు చేసుకోవడానికి ఆ దేశం కొత్త కొనుగోలుదారులను ఆకర్షించడానికి ధరలను తగ్గించింది. ఇది భారతదేశానికి ప్రయోజనం కలిగించింది. ఫలితంగా 2022 ముందు భారతదేశం తన మొత్తం ముడి చమురు (crude oil) దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతం కంటే తక్కువగా ఉండగా ఇప్పుడు అది 40 శాతానికి పెరిగింది.
India imports Russian oil : విక్రయాల్లో కీలక పాత్ర
సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) నివేదిక ప్రకారం రష్యా తన మూడో ఏడాది చమురు విక్రయాల్లో కొత్త మార్కెట్లను బలపరచుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు అమ్మకాల్లో రష్యా ఆదాయంలో 74 శాతం మూడు ప్రధాన దేశాల నుంచి వచ్చింది. చైనా నుంచి 78 బిలియన్ యూరోలు, భారతదేశం నుంచి 49 బిలియన్ యూరోలు, టర్కీ నుంచి 34 బిలియన్ యూరోల ఆదాయం పొందింది.
రష్యా చమురు కొనుగోలు ఎంత?
రష్యా నుంచి భారతదేశం ముడి చమురు కొనుగోలు 8 శాతం వృద్ధి చెందిందని CREA నివేదిక చెబుతోంది. ఉక్రెయిన్‌పై దాడి మొదలైనప్పటి నుంచి 847 బిలియన్ యూరోల విలువైన ఇంధన ఆదాయాన్ని రష్యా సంపాదించింది.
జీ7 దేశాలకు ఎగుమతి
భారతదేశంలోని కొన్ని రిఫైనరీలు రష్యా చమురును ప్రాసెస్ చేసి పెట్రోల్, డీజిల్‌గా మార్చి యూరోప్, ఇతర జీ7+ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. CREA నివేదిక ప్రకారం మూడో ఏడాదిలో భారతదేశం, టర్కీలోని రిఫైనరీల నుంచి 18 బిలియన్ యూరోలు విలువైన చమురు ఉత్పత్తులు జి7+ దేశాలకు సరఫరా అయ్యాయి. ఇందులో 9 బిలియన్ యూరోలు విలువైన ఉత్పత్తులు ప్రత్యేకంగా రష్యా ముడి చమురును ప్రాసెస్ చేశారు. భారతదేశం, టర్కీ రిఫైనరీలు రష్యా ముడి చమురు వినియోగాన్ని 10 శాతం పెంచడంతో ఈ ఉత్పత్తుల ధరలు 25 శాతం పెరిగాయి.
భారతదేశం నుంచి యూరోప్‌కు..
భారతదేశం, టర్కీ రిఫైనరీల నుంచి ముడి చమురు ఉత్పత్తులను యూరోపియన్ యూనియన్ అత్యధికంగా దిగుమతి చేసుకుంటోంది. మూడో ఏడాదిలో యూరోప్‌కు భారతదేశం నుంచి ఎగుమతైన చమురు ఉత్పత్తుల మొత్తం 13 శాతం ఉంది.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
ఉక్రెయిన్(Ukrain) పై రష్యా 2022లో దాడి చేసినప్పుడు అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర పశ్చిమ దేశాలు రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా అనేక ఆంక్షలను విధించాయి. వాటిలో ముఖ్యమైనది రష్యా ముడి చమురు ఎగుమతులపై పరిమితి విధించడం. ఈ ఆంక్షల వల్ల రష్యా తన చమురు ప్రధాన మార్కెట్లను కోల్పోయింది. దీంతో కొత్త కొనుగోలుదారులను ఆకర్షించడానికి తక్కువ ధరలకు ముడి చమురు విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ అవకాశాన్ని భారతదేశం సద్వినియోగం చేసుకుంది. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, పెరిగే ధరలతో నష్టపోకుండా రష్యా చమురు (Russian oil) ను తక్కువ ధరకు కొనుగోలు చేయడం ద్వారా ప్రయోజనం పొందుతోంది. కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ మార్కెట్ ధరతో పోలిస్తే 18-20 డాలర్ల తక్కువ ధరకు రష్యా చమురు లభించింది. అయితే, ఇటీవలి ఈ డిస్కౌంట్ తగ్గి 3 డాలర్ల కన్నా తక్కువకు వచ్చిందని నివేదిక తెలియజేస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..