Prabhas New Movie : టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ అయినట్టు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ (Rebal star Prabhas), క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma)కాంబోలో మూవీ ఓకే అయినట్టు ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ స్టోరీస్ తో మూవీస్ తీసినా హనుమాన్ తో (Hanuman)ప్రశాంత్ వర్మ రేంజ్ మారిపోయింది. ఆ మూవీ దాదాపు 400 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్టు గా నిలిచింది. డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ కి పెద్ద సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది.
ఆల్రెడీ హనుమాన్ కి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఇందులో హనుమాన్ గా రిషబ్ శెట్టి ని(Rishab shetti) కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిగాక నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ భాద్యతలు కూడా మోయనున్నాడు. మూవీకి కొబ్బరికాయ కొట్టినా రెగ్యులర్ షూటింగు మాత్రం జరగట్లేదు.సినిమా ఆగిపోయిందని వస్తున్న వార్తలపై మూవీ టీమ్ స్పందించి ఈ మూవీ ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే అవకాశం ఉంది.
ఇదిగాక ప్రశాంత్ వర్మ దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా వరుసగా హీరోలను లాక్ చేస్తూ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. లేటెస్టుగా తన దగ్గర ఉన్న కథల్లో ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్ కి వినిపించినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రజెంట్ ఇద్దరు కూడా కొన్ని సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఆ కమిట్మెంట్స్ అయిపోయాక చేతులు కలుపుతారని టాక్.
Prabhas New Movie : ఇద్దరూ కలిస్తే బాక్సాఫీస్ బద్దలే..
ప్రభాస్ తో హోంబాలే ఫిలిమ్స్ మూడు సినిమాలు చేయాల్సి ఉంది. అందులో ఒకటి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ లుక్ కోసం టెస్ట్ కూడా చేశారట. ఆల్రెడీ ఒక లుక్ ని ప్రశాంత్ వర్మ ఫైనల్ చేసినట్టు ఫిలిం నగర్ లో ఈ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ మూవీ ఒకే అయితే మాత్రం ఇండియాలోనే టాప్ డైరెక్టర్ ల లిస్ట్ లో అతడు చేరిపోతాడు. ప్రభాస్ మూవీ రిలీజ్ అయితే చాలు 1000 కోట్లు పక్కా అన్నట్టు ఉంది ఇప్పుడు అతడి రేంజ్. ఇక స్టార్ లేకుండా కథతోనే 400 కోట్లు కొల్లగొట్టిన ప్రశాంత్ వర్మ తనతో మూవీ తీస్తే బాక్సాఫీసు కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. వీరి కాంబో మూవీపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా వీరి కాంబినేషన్లో మూవీ రాబోతుందన్న రూమర్ పై రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








