PM Modi : అవరోధాలన్నింటినీ అధిగమించి అభివృద్ధి పథంలో ముందుకు సాగుదామని ప్రధాని నరేంద్ర మోదీ /Prime Minister Narendra Modi) అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లడంతోపాటు కేంద్ర బడ్జెట్ ద్వారా క్షేత్రస్థాయి (ground level) లో అభివృద్ధి జరిగేలా ప్రజలు తమ సూచనలను ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. “వ్యవసాయం గ్రామీణ సమృద్ధి” అనే అంశంపై ఆయన పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో వర్చువల్ (virtually the post-budget webinar) గా ఆయన ఈ రోజు ప్రసంగించారు.
బడ్జెట్‌లో అన్ని వర్గాల సూచనలు పాటించాం
కేంద్ర ప్రభుత్వం మూడోసారి కూడా పూర్తి బడ్జెట్ (budget)ను సమర్పించిందని, దీని విధానంలో స్థిరత్వాన్ని అవలంబించిందని ప్రధాని (PM Modi) అన్నారు. వికసిత భారత్ దృష్టిని ఇందులో ప్రతిబించిందని అన్నారు. బడ్జెట్‌కు ముందు అన్ని వర్గాల నుంచి వచ్చిన సూచనలు, ఇన్‌పుట్లను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు.
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం : PM Modi
ప్రస్తుత బడ్జెట్‌ను క్షేత్రస్థాయిలో మరింత అమలు చేయాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ముఖ్యంగా వ్యవసాయం (Agriculture), గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి అనే రైలుకు వ్యవసాయమే మొదటి ఇంజిన్ అని అభివర్ణించారు. దిగుమతులపై ఆధారపడకుండా పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని, ప్రైవేట్ రంగం అధిక దిగుబడి కలిగిన పంటల విత్తనాలపై దృష్టి పెట్టాల్సి ఉందని అన్నారు.
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
ప్రభుత్వ విధానాల ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపించాలంటే రైతులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి పనిచేయాలని మోదీ కోరారు. వ్యవసాయ రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వమే కాకుండా, ప్రైవేట్ రంగం కూడా కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో తీసుకొచ్చిన నూతన విధానాలను ప్రజల ముంగిటకు చేర్చేందుకు అధికారులు కృషి చేయాలని మోదీ సూచించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








