Sarkar Live

PM Modi at Vantara | క్రూర జంతువుల‌తో మోదీ.. స్వ‌యంగా ఆహారం పెట్టిన ప్ర‌ధాని

PM Modi at Vantara : గుజరాత్‌లోని వంతారా (Vantara) వద్ద ఒక విశిష్టమైన వన్యప్రాణి రక్షణ, పునరావాసం & సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించారు. విభిన్న జాతుల వన్యప్రాణులకు ఆశ్రయం క‌ల్పించేందుకు

PM Modi at Vantara

PM Modi at Vantara : గుజరాత్‌లోని వంతారా (Vantara) వద్ద ఒక విశిష్టమైన వన్యప్రాణి రక్షణ, పునరావాసం & సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించారు. విభిన్న జాతుల వన్యప్రాణులకు ఆశ్రయం క‌ల్పించేందుకు ఈ కేంద్రాన్ని (wildlife rescue, rehabilitation, and conservation centre) ఏర్పాటు చేశారు. ఇందులో పునరావాసం పొందిన జంతువులను మోదీ దగ్గరగా పరిశీలించారు. వాటికి అందుతున్న సేవ‌లు, సంర‌క్ష‌ణ‌పై ఆరా తీశారు.

వ‌న్య‌ప్రాణుల వైద్య సేవ‌ల‌ను ప‌రిశీలించిన మోదీ

ఈ సందర్భంగా వన్యప్రాణి ఆస్ప‌త్రి (wildlife hospital)ని కూడా ప్ర‌ధాని మోదీ సంద‌ర్శించారు. అక్క‌డ అందుబాటులో ఉన్న వైద్య సేవ‌ల‌ను ప‌రిశీలించారు. ఈ ఆస్పత్రిలో వ‌న్య‌ప్రాణుల‌కు MRI, CT స్కాన్లు, ఇతర ఆధునిక వైద్య పరికరాలతోపాటు ఐసీయూలు, అనస్తీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, అంతర్గత వైద్యం వంటి విభాగాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ప‌ని విధానాన్ని మోదీ ప‌రిశీలించారు. ఒక ఆసియాటిక్ సింహం MRI పరీక్ష చేయించుకుంటున్న దృశ్యాన్నిఆయ‌న ద‌గ్గ‌రుండి చూశారు. ఆధునిక పరికరాలను ఉపయోగించి జంతువుల వైద్య పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారో ఆయన ప్రత్యక్షంగా తిల‌కించారు. హైవేపై కారు ఢీకొని గాయపడిన ఒక చిరుతపులి ఆపరేషన్ థియేటర్‌లో చికిత్స పొందుతున్న సమయంలో అక్కడికి వెళ్లి పరిస్థితిని స్వయంగా అంచనా వేశారు. ఈ కేంద్రం వద్ద జంతువుల వైద్యానికి అత్యాధునిక సదుపాయాలు కలవడం వల్లే గాయపడిన జంతువులకు సత్వర చికిత్స అందించగలుగుతుండ‌టంపై మోదీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

PM Modi at Vantara : జంతువులకు ఆహారం పెట్టిన ప్రధాని

ప్రధాని మోదీ ((Prime Minister Narendra Modi) ఈ పర్యటనలో కొన్ని క్రూర జంతువులతో మెలిగారు. సాధారణంగా మనుషులకు దూరంగా ఉండే కొన్ని అరుదైన జంతువులను దగ్గరగా వెళ్లి పరిశీలించారు. ఆసియాటిక్ సింహపు కూన‌లు, తెల్ల సింహపు కూన‌, క్లౌడెడ్ చిరుత, కారకల్ కూన‌ల‌కు స్వ‌యంగా ఆహారం పెట్టారు. ఇవ‌న్నీ వంతారాలో సంర‌క్ష‌ణ పొందుతున్న జంతువులే.

వంతారాలో వన్యప్రాణుల సంరక్షణ

వంతారా కేంద్రంలోని జంతువులను వాటి సహజ ఆవాసానికి దగ్గరగా ఉండే విధంగా ప్రత్యేక ప్రదేశాల్లో ఉంచారు. అచ్చంగా అడవుల తరహాలో ఇక్కడి వాతావరణాన్ని రూపొందించారు. వాటికి సహజ జీవనం కలిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రంలో ఆసియాటిక్ సింహం, హిమ పులి (స్నో లెపార్డ్), ఒక కొమ్ము గల ఖడ్గమృగం (రైనో) వంటి జాతుల సంరక్షణ కీలకంగా నిలుస్తోంది. భారతదేశంలో కొన్ని వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతుండటంతో వాటిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?