Graduate MLC Elections : కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థి అంజిరెడ్డి ఎట్టకేలకు విజయం సాధించారు. మూడు రోజులుగా కౌంటింగ్ మారథాన్ ముగిసింది. మొదటి ప్రాధాన్యత వోట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి (Anji Reddy) విజయం సాధించారు. కాగా ఈవిషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో నిలవగా, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో ఉన్నారు. ఒక వైపు కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది.
కాగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం మూడోరోజు ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 వోట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 73,644 వోట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 63,404 ఓట్లు లభించాయి. అంజిరెడ్డి విజయం ఖరారు కావడంతో కౌంటింగ్ హాలు నుంచి నరేందర్ రెడ్డి వెళ్లిపోయారు. కాగా, కరీంనగర్ టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..