Ex CM KCR Meeting in Erravalli : బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ (K) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఉద్యమాల గడ్డ ఓరుగల్లు (Warangal)లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కనీవినీ ఎరుగుని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు వరంగల్ సమీపంలో విశాలమైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయిస్తామని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన సమావేశంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.
KCR : తెలంగాణ సమాజం కష్టాల్లో ఉంది..
ఈ సందర్భంగా కేసీఆర్ (K.Chandra shekhar Rao) ప్రసంగిస్తూ… తెలంగాణ సాధన కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. బిఆర్ ఎస్ పాలనలో పది సంవత్సరాలపాటు రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన చేసుకొని దేశానికే రోల్ మోడల్‌గా నిలిచామని చెప్పారు. కానీ ప్రస్తుతం తెలంగాణ సమాజం కష్టాల్లో ఉందన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో జరుపుకోబోయే రజతోత్సవాలు కేవలం బిఆర్ఎస్ పార్టీకే పరిమితం కాదని యావత్ తెలంగాణ సమాజం అందులో భాగస్వామ్యమవుతుందని చెప్పారు.
కాగా బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజక వర్గాల వారీగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ బహిరంగ సభ అనంతరం.. పార్టీనీ గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ట పరిచి, కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన ఆయన తెలిపారు. ఆ తర్వాత నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..