Falcon Scam : ఫాల్కన్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు ఉపయోగించిన హాకర్ 800A జెట్ (N935H) జెట్ విమానాన్ని ఎన్‌ఫోర్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate (ED) హైదరాబాద్ శాఖ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport (RGIA)లో స్వాధీనం చేసుకుంది. ఫాల్కన్ స్కాం ప్రధాన నిందితుడు అమర్‍దీప్ కుమార్ ఈ జెట్‌ను రూ. 850 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Falcon Scam ఎలా జరిగింది?
గత నెలలో ఫాల్కన్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై Enforcement Directorate (ED) దర్యాప్తును ప్రారంభించింది. సైబరాబాద్ పోలీసులు ఈ కేసును ముందుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. అధిక లాభాలు ఇస్తామంటూ పెట్టుబడిదారుల నుంచి ఫాల్కన్ గ్రూప్ సంస్థ భారీగా నిధులు వసూలు చేసి మోసం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పెట్టుబడి పేరుతో మొత్తం రూ. 1,700 కోట్లను ఆ సంస్థ సేకరించింది. అందులో రూ. 850 కోట్లు తిరిగి చెల్లించగా, 6,979 మంది ఇన్వెస్టర్లు నష్టపోయారు.
హాకర్ 800A జెట్ కొనుగోలు
ED అధికారుల తెలిపిన వివరాల ప్రకారం అమర్‍దీప్ కుమార్ 2024లో అమెరికాకు చెందిన ప్రెస్టీజ్ జెట్స్ ఇంక్ (Prestige Jets Inc) ద్వారా హాకర్ 800A జెట్‌ను కొనుగోలు చేశాడు. దీని ధర 1.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 14 కోట్లు). ఈ జెట్ కొనుగోలు కోసం ఫాల్కన్ గ్రూప్ స్కాం ద్వారా అక్రమంగా సమీకరించిన నిధులను వాడినట్లు ED ఆరోపిస్తోంది.
జెట్‌లో పరారైన ప్రధాన నిందితుడు
ఈ స్కాం వెలుగుచూసిన తర్వాత ప్రధాన నిందితుడు అమర్‍దీప్ కుమార్ ఈజెట్ ( Hawker 800A jet)ను ఉపయోగించి జనవరి 22న తన సహచరుడితో కలిసి దుబాయ్‌కు పారిపోయాడు. స్కాం బయటపడిన వెంటనే అతను ఎలాంటి అవాంతరాలు లేకుండా దేశం విడిచి వెళ్లిపోయాడు. అయితే, ఈ విమానం తిరిగి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన తర్వాత ED స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా విమాన సిబ్బందిని ఈడీ ప్రశ్నించింది. అంతేకాకుండా నిందితుడికి సన్నిహితుడైన ఓ వ్యక్తి నుంచి కీలక వాగ్మూలాన్ని నమోదు చేసింది.
Falcon Scam : సైబరాబాద్ పోలీసుల విచారణ
సైబరాబాద్ పోలీసులు ఫాల్కన్ గ్రూప్‌పై ముందు కేసు నమోదు చేశారు. ఈ సంస్థ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో పెట్టుబడిదారులను మోసం చేసింది. ఈ వ్యవహారంలో భాగంగా ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఒడెల, డైరెక్టర్ కావ్య నల్లూరిని ఫిబ్రవరి 15న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఈ స్కామ్‌లో ఇంకా పలు కీలక నిందితులు పారిపోగా, వారి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.
ED దర్యాప్తులో కొత్త కోణాలు
Enforcement Directorate దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగుచూశాయి. ఫాల్కన్ గ్రూప్ సంస్థ మోసపూరిత లావాదేవీలను విదేశాల్లోనూ విస్తరించినట్లు ఆధారాలు లభించాయి. వివిధ బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమంగా డబ్బులు బదిలీ చేసిన రికార్డులు దొరికాయి. హాకర్ 800A జెట్‌తో పాటు స్కాంలో భాగంగా మరికొన్ని విలువైన ఆస్తుల కొనుగోలు జరిగి ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి. ఫాల్కన్ గ్రూప్ భారీ లాభాలను ఆశ చూపి అనేక మందిని మోసగించింది. పెట్టుబడి డబ్బులను అధిక వడ్డీ లాభాలుగా తిరిగి ఇస్తామంటూ భరోసా ఇచ్చి, నిధులు సేకరించింది. ఆ తర్వాత నిధులు దారి మళ్లించి, మోసం చేసినట్లు ED పేర్కొంటోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..