Atlee Movie | పుష్ప-2 (pushpa-2) తో హిట్టు కొట్టిన తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun ) ఏ సినిమా చేయాలో తెలియక తికమకపడిపోతున్నారు.కొన్ని రోజులుగా కొందరి డైరక్టర్ ల పేర్లు తెరపైకి వచ్చాయి. మొన్నటివరకు త్రివిక్రమ్ (Trivikram) తో ఒక పౌరాణిక చిత్రం తీస్తాడని టాక్ వినిపించింది. ఇప్పుడు అట్లీ (Atlee) లైన్ లోకి వచ్చాడని తెలుస్తోంది. అట్లీ జవాన్ తో వెయ్యి కోట్లు కొల్లగొట్టి పాన్ ఇండియన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.
త్రివిక్రమ్ మూవీ టైమ్ పట్టొచ్చు..?
ఇప్పుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తో ఒక మూవీ తీయబోతున్నారని ఒక రూమర్ వినబడింది. కథ కూడా చెప్పాడని మురగదాస్ (Murugadas) తో తీస్తున్న సికిందర్ మూవీ అయిపోగానే మొదలు పెడతారని అందరూ అనుకున్నారు. కానీ అట్లీ అల్లు అర్జున్ కు కూడా కథ చెప్పి లైన్లో పెట్టాడు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో మూవీ ప్లాన్ లో ఉండగా ఇది అయిపోయాక మొదలు పెట్టాలని, అంతలో సల్మాన్ ఖాన్ తో మూవీ కంప్లీట్ చేయొచ్చు అనే ప్లాన్ లో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మారింది. మొన్న ఒక ప్రొడ్యూసర్ కూడా త్రివిక్రమ్ తో మూవీ ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని,ఈ ఏడాది చివరిలో మొదలుకావొచ్చని ఒక హింటు కూడా ఇచ్చాడు. కాబట్టి అల్లు అర్జున్ ముందుగా అట్లీ మూవీ నే సెట్స్ పైకి తీసుకెళ్తాడని ఫిలింనగర్ టాక్.
అయితే ఇందులో యాక్టర్స్ టెక్నీషియన్స్ ఎవరు పనిచేస్తార నే దానిపైనే చర్చ జరుగుతోంది. అట్లీ అల్లు అర్జున్ కాంబో మూవీ అంటే ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు ఏ రేంజ్ లో పెట్టుకుంటారో తెలుసు.హీరోయిన్ ఎవరు,విలన్ ఎవరు,మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకుంటున్నారని ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంటారు. రీసెంట్ గా ఫిలిం నగర్ లో ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో అమరన్ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న శివ కార్తికేయన్ విలన్ రోల్ చేయబోతున్నాడని వినబడుతోంది.
విలన్ గా శివకార్తికేయన్ ఒప్పుకుంటాడా.?
చాలా ఏళ్ల క్రితం నుంచే అట్లీ శివకార్తికేయన్ కి మంచి బాండింగ్ ఉంది. అట్లీ డైరెక్టర్ కాకముందు కూడా శివ కార్తికే యన్ తో షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ఇక డైరెక్టర్ అయ్యాక సూపర్ హిట్ మూవీ రాజా రాణి శివ కార్తికేయనే చేయాల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వల్ల వేరే హీరోతో చేయవలసి వచ్చిందట. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా అట్లీ 1000 కోట్లు కొడితే, పుష్ప-2 మూవీతో అల్లు అర్జున్ 1800 కోట్లు కొట్టాడు. ఇక రీసెంట్ గా అమరన్ మూవీతో శివకార్తికేయన్ 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టాడు.
ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్లో మూవీ పడిందంటే అది నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. అందులో శివ కార్తికేయన్ విలన్ రోల్ చేస్తే తిరుగు ఉండదని చర్చించుకుంటున్నారు. కానీ హీరోగా సక్సెస్ఫుల్ కెరియర్ లో ఉన్న శివ కార్తికేయన్ విలన్ రోల్ చేస్తాడా అన్నది సందేహమే. కానీ అట్లీతో ఉన్న బాండింగ్ వల్ల ఆ రోల్ ఒప్పుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ ముగ్గురు కాంబినేషన్లో మూవీ పడితే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవుతుందనడంలో సందేహం లేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..