Sarkar Live

KCR | అసెంబ్లీకి చేరుకున్న గులాబీ దళపతి

KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీ (Telangana Assembly )కి చేరుకున్నారు. కాసేపటి క్రితమే హైదరాబాద్‌లోని నందినగర్‌ నుంచి బయల్దేరి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌

KCR

KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీ (Telangana Assembly )కి చేరుకున్నారు. కాసేపటి క్రితమే హైదరాబాద్‌లోని నందినగర్‌ నుంచి బయల్దేరి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ శర్మ ప్రసంగంతో శాసన సభ సమావేశాలు (Assembly Session 2025) ప్రారంభం కానున్నాయి. కాగా అసెంబ్లీ వద్ద కేసీఆర్‌కు బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన అసెంబ్లీ ప్రాంగణం లోని బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు.

అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తిస్థాయిలో రెడీ అయింది. ఈమేరకు నిన్ననే మాజీ సీఎం కేసీఆర్ (KCR) బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అవినీతిపై చీల్చిచెండాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలపై అసెంబ్లీలో నిలదీయాలని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి గొంతుకగా ఉభయసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బిఆర్ ఎస్ సభ్యులకు ఉద్బోధించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?