Rajiv Yuva Vikasam : తెలంగాణ ప్రభుత్వం (Telangana government) నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. వీరి కోసం రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత దీని ద్వారా స్వయం ఉపాధి (self-employment) అవకాశాలు పొందొచ్చు. ఇందుకు ప్రభుత్వం రూ.6,000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరనుంది. అర్హత పొందిన ప్రతి అభ్యర్థికీ రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందనుంది.
సొంత పరిశ్రమను స్థాపించుకొనేలా..
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకం ముఖ్యోద్దేశం. లబ్ధిదారులు స్వయం ఉపాధి ద్వారా తమ జీవితాలను మెరుగుపరచుకోవచ్చు. ఈ పథకాన్ని లబ్ధిదారులు తమ సొంత వ్యాపారం లేదా చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడానికి ఉపయోగించుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
Rajiv Yuva Vikasam : పథకం ప్రయోజనాలు
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ Rajiv Yuva Vikasam పథకం ద్వారా చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువత తమ జీవితాల్లో స్థిరత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
- దరఖాస్తుల ప్రారంభం: మార్చి 15, 2025
- దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఏప్రిల్ 5, 2025
- దరఖాస్తుల పరిశీలన: ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు జరుగుతుంది
- అర్హత పొందిన లబ్ధిదారుకు మంజూరు పత్రాలు: జూన్ 2, 2025 (తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు).
Rajiv Yuva Vikasam : అర్హతలు
- దరఖాస్తుదారు తెలంగాణ రాష్ట్ర పౌరుడు అయ్యుండాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువకులు అర్హులు.
- అభ్యర్థి వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అభ్యర్థి ఏదైనా స్వయం ఉపాధి అవకాశాన్ని మొదలు పెట్టాలని ఉద్దేశించాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆధార్ కార్డు, విద్యా అర్హతలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు అప్‌లోడ్ చేయాలి.
- సమర్పించిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి అర్హత పొందిన వారికి ఆర్థిక సహాయం అందజేస్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..