విద్యుత్ సేవల మాటున తాటివనంలో దావత్
Shayampet | కరెంటోళ్లు కల్లు దావత్ (Toddy Davat) చేసుకున్నారు. విద్యుత్ సేవల మాటున తాటివనంలో దావత్ చేసుకున్నారు. విద్యుత్ ఉద్యోగులు (Electrical Deportmnet workers) విధులు మరిచి తాటివనంలో కల్లు తాగుకుంటూ కన్పించడంతో కల్లుతాగడానికి వచ్చిన ప్రజలు సైతం వారిని చూసి ఒకింత ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం లోని ఓ గ్రామంలో మంగళవారం కరెంటోళ్లు ఓ గ్రామంలోని తాటివనంలో కల్లు దావత్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
విధుల్లో ఉండాల్సిన వారు కల్లు తాగుతూ తాటివనం (Toddy palm forest) లో కనిపించడం ఇప్పుడు శాయంపేట మండలం (Shayampet Mandal) లో హాట్ టాపిక్ గా మారినట్లు తెలిసింది. నిత్యం ఎప్పటికప్పుడు విద్యుత్ విషయంలో అంతరాయం ఏర్పడితే పరిష్కరించాల్సిన సదరు ఉద్యోగులు అవేమి పట్టించుకోకుండా కల్లు దావత్ చేసుకోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలో జరిగిన ఆ కల్లు దావత్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే…
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..