Warangal DTC | రాష్ట్రంలో పలు ప్రాంతీయ రవాణా సంస్థ కార్యాలయాలు, చెక్‌పోస్టుల వద్ద భారీగా అవినీతి జరుగుతోంది. కిందిస్థాయి సిబ్బందిపై పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు లేకపోవడంతో సిబ్బది, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములతోనే అందాల్సిన సేవలు కార్యాలయాల్లో అదనంగా ముడుపులు అందిస్తే గానీ పని జరగని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
Warangal DTC నియామకం ఎప్పుడు?
ఇదిలా ఉంటే వరంగల్ ఉప రవాణా కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసు (Illegal Assets case) లో పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (DTC) పుప్పాల శ్రీనివాస్ ( Puppala Srinivas)కు అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో హైదరాబాద్‌లోని శ్రీనివాస్ నివాసంతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం అప్పట్లో సంచలనం రేపింది.
అయితే ఆ అధికారి జైలుకెళ్లి 40 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆయన స్థానంలో రవాణా శాఖ ఎవరినీ నియమించలేదు. కనీసం ఇంచార్జిగా కూడా ఎవరికీ బాధ్యతలు అప్పజెప్పకపోవడంతో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరిధిలోని రవాణా శాఖ కార్యాలయాలు, చెక్ పోస్టుల్లో పర్యవేక్షణ కరువై పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆ శాఖలోని ఉద్యోగులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా రవాణా శాఖ కమిషనర్ దృష్టి సారించి డిటిసి ని నియమించాలని వాహనదారులు కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..