AP Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt.) ఉద్యోగుల (Employees)కు పండుగ వంటి శుభవార్త అందించింది. వారికి ఇవ్వాల్సిన బకాయిలను బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ముఖ్యంగా జీపీఎఫ్ (GPF), జీఎల్‌ఐ (GLI) బకాయిలను విడుదల చేసింది. సోమవారం ఉదయం 11:30 గంటల నుంచి ఉద్యోగుల ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతున్నాయి. మంగళవారం లేదా బుధవారం సాయంత్రానికి పూర్తిగా ఈ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఉద్యోగుల బకాయిలను విడుదల చేస్తున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు ధృవీకరించారు.
ఉద్యోగులకు భారీ ఊరట
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇచ్చిన నిర్ణయంతో భారీ ఊరట లభించింది. ఈ ఫండ్స్ విడుదలకు ఆయన శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం రూ.6,200 కోట్లు అనుసరించి ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. సోమవారం నుంచి ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతుండగా ఈ మొత్తంలో సీపీఎస్ (CPS), జీపీఎఫ్ (GPF), ఏపీజీఏఐ (APGLI) కింద ప్రభుత్వ ఖజానా నుంచి రూ.6,200 కోట్లు మంజూరు అయ్యాయి. జనవరిలో కూడా రూ.1,033 కోట్ల బకాయిలను ప్రభుత్వం (Andhra pradesh government) చెల్లించిన విషయం తెలిసిందే.
ఉద్యోగ సంఘాల హర్షం
ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేయడంపై ఏపీ జేఏసీ (AP JAC) నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉద్యోగ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలను తక్షణమే చెల్లించాలనే సీఎం (CM Chandrababu Naidu) నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. అలాగే వేతన పెంపు, ఇతర ఆర్థిక ప్రయోజనాలపై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ ఫండ్ విడుదల వల్ల ఉద్యోగులు గణనీయమైన ప్రయోజనం పొందబోతున్నారని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఈ మొత్తాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
AP Employees : విడతల వారీగా చెల్లింపులు
గతంలో కూడా ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తూ వస్తోంది. జనవరిలో రూ.1,033 కోట్ల బకాయిలను విడుదల చేయగా, ఇప్పుడు రూ.6,200 కోట్లను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగులు, పింఛనర్లు లబ్ధి పొందనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








