Big Relief for Drivers : ఓలా, ఉబర్ (Ola and Uber) దోపిడీకి ఇక చెక్ పడనుంది. వీటికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం (central government) కొత్త యాప్ (new app )ను ప్రవేశపెట్టబోతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది క్యాబ్, ఆటో, బైక్ డ్రైవర్లు తమ జీవనోపాధి కోసం ఓలా, ఉబర్ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రయాణికుల నుంచి వసూలు చేసే చార్జీల్లో కంపెనీలు పెద్ద మొత్తాన్ని తీసుకోవడంతో డ్రైవర్లకు తక్కువ వాటా మాత్రమే అందుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు.
సహకార్ యాప్ రంగ ప్రవేశం : Big Relief for Drivers
ఓలా ఉబర్ (Ola and Uber) లకు ప్రత్యామ్నాయంగా కేంద్రం కొత్త యాప్‌ను తీసుకురాబోతుంది. దీనికి సహకార్ టాక్సీ (Sahkaar Taxi) అని పేరు పెట్టారు. ఇది కూడా ఓలా, ఉబర్ల మాదిరిగానే పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న డ్రైవర్ల వద్ద నుంచి ఏ విధమైన కమిషన్ వసూలు చేయదు (it will not charge any commission from drivers). ప్రయాణికులు చెల్లించే మొత్తం పూర్తిగా డ్రైవర్‌కే చేరనుంది.
ఆదాయం పెంచే మార్గం
ప్రస్తుతం ప్రైవేట్ క్యాబ్ కంపెనీలు ( private cab companies) డ్రైవర్ల వద్ద నుంచి 20 నుంచి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నాయి. ప్రయాణికులు ఎంత చెల్లించినా అందులోని ఎక్కువ శాతం కంపెనీల లాభాల్లోకి వెళ్తోంది. ఇది చాలా మంది డ్రైవర్ల జీవితాలను కష్టాల్లోకి నెడుతోంది. కొత్త సహకార్ టాక్సీ యాప్ ద్వారా డ్రైవర్లకు పూర్తిగా ఆదాయం అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ప్రైవేట్ క్యాబ్ కంపెలకు పెను సవాల్
ప్రస్తుత క్యాబ్ యాప్‌లలో రైడ్ చార్జీలు వివిధ కారణాల వల్ల మారుతూ ఉంటాయి. ఒకే రూట్‌కు ఒకేచోట, వేర్వేరు సమయంలో చార్జీలు మారడం, వినియోగదారులు వాడుతున్న మొబైల్ ఫోన్ ఆధారంగా ధరలు మారుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (Central Consumer Protection Authority ) ఓలా, ఉబర్‌లకు నోటీసులు కూడా జారీ చేసింది. ఓలా, ఉబర్ (Ola and Uber) సంస్థలు ఈ ఆరోపణలను ఖండించాయి. తమ యాప్‌లో ధరలు ఫిక్స్గానే ఉంటాయని, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా చార్జీలు మారవని వెల్లడించాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రత్యేక యాప్‌ను తీసుకురావడం ప్రైవేట్ క్యాబ్ కంపెనీలకు పెద్ద సవాల్‌గా మారనుంది.
ప్రయాణికులకూ ప్రయోజనకరమే..
కొత్త సహకార్ టాక్సీ వల్ల డ్రైవర్లకు పూర్తిగా వారి ఆదాయం అందే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల (Passengers)కు కూడా ఇది ప్రయోజనకరమే. అకస్మాత్తుగా చార్జీలు పెరగకుండా న్యాయమైన ధరలకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేట్ క్యాబ్ కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించడంతో పాటు డ్రైవర్ల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది.
రవాణా రంగంలో పెను మార్పు
ఇప్పటివరకు ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సేవలు మార్కెట్‌ను ఆక్రమించాయి. అయితే, వీటి వ్యాపార విధానాలు చాలామంది డ్రైవర్లను ఆర్థికంగా నష్టపరిచాయని విమర్శలు ఉన్నాయి. కేంద్రం సహకార్ టాక్సీ యాప్‌ను తీసుకురావడం దేశీయ రవాణా రంగంలో కీలక పరిణామంగా మారనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








