RRB ALP Job Vacancy : రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఇండియన్ రైల్వే (Indian Railway) ఒకటి. రోజుకు కోటిన్నర మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఇలాంటి విస్తృతమైన సేవలను అందించేందుకు నాణ్యమైన మానవ వనరుల అవసరం ఉంటుంది. ప్రస్తుతం రైల్వే శాఖ (Railway)లో మెకానికల్, ట్రాన్స్‌పోర్టేషన్ విభాగాల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా అసిస్టెంట్ లోకో పైలట్ (Asistant loco pilot post (ALP) పోస్టుల నియామకాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.
ఉద్యోగ స్వభావం
RRB ALP Job Vacancy : ఈ పోస్టులు రైలు నడిపే లోకో పైలట్ (loco pilots)లకు సహాయం చేసే ఉద్యోగాలు. రైలును నడిపే, నిర్వహించే బాధ్యతలు, ప్రమాదాల నివారణ, సాంకేతిక సమాచారం అందించడం వంటి అనేక కీలక కార్యకలాపాల్లో ALPలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం (Assistant loco pilot post) కోసం ఎంపిక విధానం మూడు దశలుగా ఉంటుంది.
జీత భత్యాలు (salary)
అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant loco pilot)గా ఎంపికైన వారికి అన్ని అలవెన్సులు కలుపుకొని రూ.50 వేలు లేదా అంతకన్నా ఎక్కువ జీతం లభించొచ్చు. ఇది స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కావడంతో భవిష్యత్తు చాలా భద్రతగా ఉంటుంది.
ఈ ఉద్యోగం వల్ల లభించే ప్రయోజనాలు (benefits)
- పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్
- పెన్షన్, ఇతర ప్రయోజనాలు
- వెల్ స్ట్రక్చర్డ్ ప్రమోషన్ సిస్టమ్
- రెగ్యులర్ పెరిగే జీతం
- ట్రావెల్ పాసులు, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీ
RRB ALP Job Vacancy : ఎంపిక విధానం
1.ప్రాథమిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT – 1)
- ఇది మొత్తం 75 మార్కులకు ఉంటుంది
- ప్రశ్నలు: మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటలిజెన్స్ & రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్
- ప్రశ్నల సంఖ్య: 75
- సమయం: 60 నిమిషాలు
- మెయిన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT – 2)
- ఇది రెండు భాగాలుగా ఉంటుంది:
- Part A – 100 మార్కులు (Maths, Reasoning, Science, Current Affairs)
- Part B – 75 మార్కులు (ఇది టెక్నికల్ సబ్జెక్ట్ – ఐటీఐ లేదా డిప్లొమా సిలబస్ ఆధారంగా)
3.ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఇది CBT – 2ను క్లియర్ చేసిన వారికి మాత్రమే)
- ఇది కేవలం అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు మాత్రమే ఉంటుంది.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్
- ఫైనల్ ఎంపికకు ముందు అభ్యర్థుల డాక్యుమెంట్లు పరిశీలిస్తారు
- సానుకూల మెడికల్ ఫిట్‌నెస్ తప్పనిసరి
మెడికల్ స్టాండర్డ్స్
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు ఫిజికల్ ఫిట్‌నెస్ చాలా ముఖ్యమైనది:
- దృష్టి : కనీసం 6/6 లేదా 6/9 దృష్టి ఉండాలి. అద్దాలు లేకుండా చూడగలగాలి
- రంగు గుర్తింపు : కలర్ బ్లైండ్‌నెస్ లేకూడదు
- హెయిరింగ్ కేపాసిటీ : శబ్దాలను సరిగా వినగలగాలి అప్లికేషన్ ఫీజు వివరాలు
- జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.500 (ఒకవేళ CBT-1 అటెండ్ అయితే రూ.400 రీఫండ్ చేస్తారు)
| ఎస్సీ / ఎస్టీ / మహిళలు / దివ్యాంగులకు రూ. 250 (CBT-1 అటెండ్ అయితే రూ. 250 రీఫండ్ చేస్తారు)
దరఖాస్తు ఎలా చేయాలి?
- https://indianrailways.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి
- మీ RRB జోన్‌ను సెలెక్ట్ చేసుకోండి
- “CEN No. 01/2024 – ALP” లింక్‌పై క్లిక్ చేయండి
- రిజిస్ట్రేషన్ చేయండి
- పూర్తి వివరాలు, విద్యార్హతలు, ఫొటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయండి
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి
- అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ తీసుకోండి ముఖ్యమైన తేదీలు -దరఖాస్తు ప్రారంభం : 10 ఏప్రిల్ 2025
- చివరి తేదీ : 9, మే 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.