Google lays off : టెక్ రంగాన్ని ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ (Google) ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. తన ప్లాట్‌ఫాం, డివైజ్‌లలో (platforms and devices division) పనిచేసే వందలాది ఉద్యోగుల (hundreds of employees)ను తొలగిస్తోంది. వీరిలో ఆన్‌డ్రాయిడ్ (Android ) సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, పిక్సల్ (Pixel ) ఫోన్ల రూపకల్పన, క్రోమ్ (Chrome) బ్రౌజర్ నిర్వహణ వంటి కీలక ప్రాజెక్టులపై పనిచేసే సాంకేతిక నిపుణులు ఉన్నారు. అయితే.. గూగుల్ ఈ తొలగింపులను చాలా వ్యూహాత్మకంగా చేపడుతోంది. గత సంవత్సరం జరిగిన విభాగాల విలీనానికి (merger) కొనసాగింపుగా తీసుకుందని తెలుస్తోంది.
Google lays off : ఇప్పటికే కొందరికి స్వచ్ఛంద ఉద్వాసన
గూగుల్ ఈ విభాగంలోని ఉద్యోగులకు 2025 జనవరిలో స్వచ్ఛందంగా రిటైర్మెంట్ (voluntary exit programme) ఆఫర్ చేసింది. సంస్థ మరింత సమర్థంగా పని చేయాలనే ఉద్దేశంతో కొంతమందిని స్వచ్ఛందంగా పంపింది. అయితే.. దీని తర్వాత కూడా కొన్ని ఉద్యోగాల తొలగింపును గూగుల్ కొనసాగిస్తోంది. దీనిపై గూగుల్ అధికార ప్రతినిధి మాట్టాడుతూ సంస్థ విభాగాల విలీనంతోపాటు మారుతున్న మార్కెట్ పరిస్థితులకు తగినట్లు తాము పని విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తొలగింపులు ఎంతమందిని ప్రభావితం చేశాయనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.
గూగుల్ మాత్రమే కాదు.. మరిన్ని సంస్థలు కూడా
గూగుల్ మాత్రమే కాదు.. అమెజాన్ (Amazon), ఇంటెల్ (Intel), గోల్డ్మాన్ శాక్స్ (Goldman Sachs) వంటి అనేక బడా సంస్థలు కూడా ఉద్యోగాలను తగ్గించే దిశగా కదులుతున్నాయి. అమెజాన్, ఉద్యోగ ఖర్చుల తగ్గింపు కోసం దాదాపు 14 వేల మేనేజీరియల్ ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధంగా ఉంది. ఇంటెల్ 2024లో ఎదుర్కొన్న భారీ ఆర్థిక నష్టాల తర్వాత పెద్దఎత్తున సంస్థ పునఃవ్యవస్థీకరణ (restructuring) ప్రారంభించబోతోంది. గోల్డ్మాన్ శాక్స్ కూడా 3-5 శాతం ఉద్యోగుల తొలగింపును తన వార్షిక పనితీరు సమీక్ష తర్వాత అమలు చేయబోతోంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థలు కూడా ఇప్పటికే 150 జూనియర్ బ్యాంకింగ్ ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
Google lays off : కారణం ఏమిటి?
ఈ విధమైన ఉద్యోగాల తగ్గింపుల వెనుక మరో కీలక కారణం.. టెక్నాలజీ రంగంలో వేగంగా పెరుగుతున్న కృత్రిమ మేధస్సు (AI) వినియోగం. సంస్థలు ఆటోమేషన్‌పై దృష్టి పెట్టడం, ఖర్చులను తగ్గించుకోవడం, తక్కువ మనవ శక్తితో ఎక్కువ పని సాధించాలనే ధోరణి ఎంచుకోవడం వంటివి కారణాలుగా నిలుస్తున్నాయి. గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే అనేక విభాగాల్లో ఏఐ (artificial intelligence) ఆధారిత ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొంతమంది ఉద్యోగుల అవసరం తగ్గిపోవడంతో సంస్థలు వారి స్థానంలో మెషిన్ ఇంటెలిజెన్స్ ద్వారా పనులు చేయించాలనే దిశగా అడుగులు వేస్తున్నాయి.
పిక్సెల్ ఫోన్లు, Android సాఫ్ట్‌వేర్, Chrome బ్రౌజర్ వంటి ప్రాజెక్టుల్లో పనిచేసే కొంతమంది నిపుణులను తొలగించడంతో రాబోయే రోజుల్లో ఈ ఉత్పత్తుల అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం కూడా లేకపోలేదు. కొత్త ఫీచర్ల అభివృద్ధిలో ఆలస్యం కావచ్చు, లేదా కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ గూగుల్ తాను తీసుకున్న ఈ చర్యలు సంస్థాభివృద్ధికి, సమర్థతకు దోహదం చేస్తాయనే నమ్మకంతో ముందుకెళ్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.