Sarkar Live

Vanajeevi Ramaiah | వ‌నజీవి రామయ్య ఇక లేరు.. గుండెపోటుతో మృతి

Vanajeevi Ramaiah : ‘వనజీవి’ (Vanajeevi ) దరిపల్లి రామయ్య (Daripalli Ramaiah) క‌న్నుమూశారు. గుండెపోటుతో ఖ‌మ్మం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (ఏప్రిల్ 12, 2025) ఉదయం కన్నుమూశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత (Padma Shri awardee) అయిన

Vanajeevi Ramaiah : ‘వనజీవి’ (Vanajeevi ) దరిపల్లి రామయ్య (Daripalli Ramaiah) క‌న్నుమూశారు. గుండెపోటుతో ఖ‌మ్మం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (ఏప్రిల్ 12, 2025) ఉదయం కన్నుమూశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత (Padma Shri awardee) అయిన రామ‌య్య మృతి చెంద‌డం తెలుగు రాష్ట్రాల్లో విషాదం అలుముకుంది.

ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ కోసం…

ఖమ్మం రూరల్ మండలం (Khammam Rural Mandal) రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య (88) తన జీవితాన్ని పూర్తిగా పచ్చదనానికి అంకితం చేశారు. ప్రకృతి రక్షణను జీవిత లక్ష్యంగా మార్చుకొని, వృక్షాల పెంపకమే తన ధర్మంగా స్వీకరించిన ఆయనను తెలుగు ప్రజలు ‘చెట్ల రామయ్య’ అని ప్రేమతో పిలిచేవారు. వ‌న సంప‌ద‌ను కాపాడుకోవాల‌ని ఆయ‌న ప‌రిత‌పించేవారు. ప్ర‌తి చెట్టుకూ ర‌క్ష‌ణ క‌ల్పించాల‌నుకొనేవారు. స్వ‌యంగా మొక్క‌ల‌ను విరివిగా నాటి (planted), వాటిని సంర‌క్షించ‌డ‌మే కాకుండా దీనిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌ క‌ల్పించేవారు. ఊరూరు తిరుగుతూ విత్త‌నాలు పంచేవారు. ఖాళీ భూములను ఆకుపచ్చని అడవులుగా మార్చాలన్న గొప్ప సంకల్పంతో ముందుకు సాగారు.

Vanajeevi Ramaiah : భ‌విష్య‌త్ త‌రాల కోసం దృఢ సంక‌ల్పం

వ‌న‌జీవి రామ‌య్య 2017లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ (Padma Shri award)ను స్వీక‌రించారు. సామాజిక అటవీ అభివృద్ధిలో ఆయన చేసిన అపార కృషికి గుర్తింపుగా ఆ అవార్డు ల‌భించింది. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో లక్షలాది మొక్కలను నాటిన రామయ్య.. వాటిలో అధికంగా నీడను, పండ్లను, బయోఫ్యూయల్‌ను అందించే స్థానిక జాతుల మొక్కలే నాటారు. భ‌విష్య‌త్ త‌రాలకు వ‌న సంప‌ద‌ను అందించాల‌నే ఆయ‌న దూర దృష్టికి ఇది నిద‌ర్శ‌నం.

ప‌చ్చ‌ద‌నం కోసం ఆస్తుల అమ్మ‌కం

రామ‌య్య (Vanajeevi Ramaiah) పదో తరగతి వరకు మాత్రమే చదివినా వృక్షాలపై ఎన్నో పుస్తకాలను చదివి అపార విజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. పచ్చదనం కోసం తన సొంత‌ మూడెకరాల భూమిని అమ్మి మొక్కలు, విత్తనాలు (seeds) కొనుగోలు చేసిన ఆయన త్యాగం తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. వనసంపదను సమృద్ధిగా చేయాలన్న తపనతో ఆయన జీవితాంతం పర్యావరణ సంరక్షణ కోసం శ్రమించారు.

సంతాపం తెలిపిన సీఎం రేవంత్‌

పద్మశ్రీ వనజీవి రామయ్య (Vanajeevi Ramaiah Passed away) మృతికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) సంతాపం తెలిపారు. రామయ్య ఇకలేర‌నే వార్త దిగ్భ్రాంతిని క‌లిగించింద‌న్నారు. వనజీవి (Vanajeevi ) అని అందరికీ చిరపరిచయమైన దరిపల్లి రామయ్యకు ప్రకృతి పట్ల ఉన్న ప్రేమ, బాధ్యత స్ఫూర్తిదాయకమ‌ని కొనియాడారు. ప్రకృతితో మానవజాతి సంబంధం ఎంతటి ప్ర‌ధాన‌మో ఆయన చాటిచెప్పార‌ని పేర్కొన్నారు. ప్రకృతి లేకుండా మనిషి జీవించలేడ‌న్న నమ్మకంతో ఆయన జీవించార‌ని సీఎం స్మ‌రించుకున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?