Lovers Privacy : ప్రేమించిన వారిని కలవడమంటే పల్లకీలో విహరించడం కాదు.. ఎన్నో ఆటంకాలను దాటి వెళ్లే ప్రయాణం. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పరిచయస్తుల కంట పడకుండా ప్రేమికులు (Lovers) కొన్ని సాహసాలు చేస్తుంటారు. మరికొన్నిసార్లు వెర్రిగా వ్యవహరిస్తారు. అచ్చం అలాంటి సంఘటనే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ప్రేమకథలో హైడ్రామా
ఈ సంఘటన హరియాణా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లాలోని ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయం ఓపీ జిందాల్ యూనివర్శిటీ (University)లో చోటుచేసుకుంది. అక్కడ చదువుతున్న ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌తో ప్రైవేట్‌గా మాట్లాడాలని అనుకున్నాడు. అయితే.. ఆమెను బయట కలవడానికి స్థలం దొరకడం లేదని అనిపించింది. పబ్లిక్ ప్లేస్‌లో కలిస్తే రిస్క్. అందుకే .. తన లవర్‌ను తాను ఉంటున్న హాస్టల్‌కు తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు.
Lovers Privacy : బాలివుడ్ సినిమా సీన్
బాయ్స్ హాస్టల్ (Hostel)లో అమ్మాయిని నేరుగా తీసుకురావడం సాధ్యం కాదని గ్రహించిన ఆ విద్యార్థి.. ఆమెను ఓ పెద్ద సైజ్ సూట్‌కేసు (Suitcase)లో పెట్టాడు. ఆపై ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు. బాలీవుడ్ సినిమాల్లో చూసినట్టే ప్లాన్ వేసుకున్నాడు. ప్రియురాలిని సూట్‌కేసులో క్యారీ చేస్తూ హాస్టల్ వైపు నడిచాడు.
అడ్డంగా దొరికిపోయిన వైనం
హాస్టల్ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ (Security) గార్డులకు అనుమానం కలగింది. సూట్‌కేసు బరువు ఎక్కువగా ఉందని, వింతగా ఉందని డౌట్ వచ్చింది. తక్షణమే సూట్‌కేసును గార్డులు ఓపెన్ చేయగానే అందులో ఉన్న యువతిని చూసి ఆశ్చర్యపోయారు. ఇలా ఎందుకు చేశావని ఆ విద్యార్థిని ప్రశ్నించారు. ప్రేమికులను ఇద్దరిని గేటు వద్దే నిలిపి వేశారు.. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న మరికొందరు స్టూడెంట్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా ఈ సంఘటన క్షణాల్లో వైరల్ (Viral) అయింది.
Lovers Privacy Viral video
Viral Video: गर्लफ्रेंड को सूटकेस में बंद कर बॉयज हॉस्टल पहुंचा युवक, हॉस्टल के गार्ड ने जब सूटकेस की चेकिंग की तो खुल गई पोल,देखिए वीडियो…
.
.#viralvideo #suitcase #BoysHostel #students pic.twitter.com/mq3DgjBHwY— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) April 12, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.