India lead global AI : గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (global artificial intelligence (AI) రంగానికి నేతృత్వం వహించే దిశగా భారతదేశం ముందుకు సాగుతోందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Ministry of Electronics and Information Technology) కార్యదర్శి ఎస్.కృష్ణన్ (S Krishnan) అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ సమ్మట్ (Global Technology Summit) సందర్భంగా ఆయన IANS కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రైవేట్ రంగాల్లో AI ని విస్తృతంగా ప్రవేశపెట్టేందుకు ఇది సరైన సమయం అని అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ ఫ్రంట్‌లైన్‌లో భారత్ నిలవాలన్నదే తమ లక్ష్యమన్నారు. Y2K మోమెంట్ (సంవత్సరం 2000కు ముందు) IT రంగం భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఇప్పటి AI పరిణామం కూడా అంతే గొప్పగా ఉండబోతుందని ఆయన అన్నారు.
India lead global AI : అభివృద్ధికి నాలుగు అంశాలు
భారతదేశంలో ఏఐ (artificial intelligence (AI) రంగాన్ని సుస్థిరంగా అభివృద్ధి చేయడానికి నాలుగు కీలక అంశాల్లో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కృష్ణన్ అన్నారు. కంప్యూట్ సామర్థ్యం పెంచడం, ఫౌండేషన్ మోడల్స్ పై దృష్టి, నైపుణ్య అభివృద్ధి, AI కోసం సానుకూల వాతావరణాన్ని సృష్టించడం లాంటి అంశాలు దోహదపడతాయని తెలిపారు.
ఘన విజయం సాధించాలన్నదే లక్ష్యం
పలు దేశాలు బిలియన్ల పెట్టుబడుల ప్రకటనలతో హెడ్‌లైన్స్ తగిలిస్తున్న తరుణంలో భారతదేశం మాత్రం ప్రభావం చూపే ప్రాజెక్టుల మీదే దృష్టి పెడుతోందని కృష్ణన్ తెలిపారు. AI (artificial intelligence (AI)రంగంలో మంగళయాన్ (Mangalyaan moment) మాదిరిగా ఒక ఘన విజయాన్ని సాధించాలన్నదే లక్ష్యమని చెప్పారు. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) మాదిరిగా ఏఐని కూడా దేశవ్యాప్తంగా ఉపయోగించే వనరుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. సివిల్ సొసైటీ, అకడమిక్ వర్గాలు, థింక్ ట్యాంకులు ఇలా అన్ని వర్గాలూ ఈ కన్వర్సేషన్‌లో పాల్గొలని భావిస్తోందన్నారు. “కొందరి దృష్టిలో మేము ఎక్కువగా కౌన్సల్టేషన్ చేస్తున్నామేమో, కానీ అది సరైనదే ” అని అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.