Top ranking : పోలీసు శాఖ, న్యాయ వ్యవస్థ పనితీరులో తెలుగు రాష్ట్రాలు అగ్రభాగాన నిలిచాయి. తెలంగాణ (Telangana) పోలీసు శాఖ పనితీరు నంబర్ వన్‌గా నిలవగా, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రెండో స్థానాన్ని సంపాదించుకుంది. న్యాయ వ్యవస్థ, పోలీసు శాఖ వంటి ప్రధాన రంగాల్లో రాష్ట్రాల పనితీరును అంచనా వేసే ఇండియా జస్టిస్ రిపోర్ట్ ( India Justice Report (IJR)-2025 నివేదిక ఈ మేరకు వెల్లడించింది. దేశంలోని పెద్ద, మధ్య రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసుల పనితీరు ప్రథమ స్థానం, ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్‌లో తెలంగాణ (Telangana) 10లో 6.48 స్కోరు సాధించి టాప్ పొజిషన్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 6.44 స్కోరు సాధించి రెండో స్థానం, కర్ణాటక (Karnataka) 6.19 స్కోరు సాధించి మూడో స్థానంలో ఉన్నాయి. చిట్ట చివరి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), పశ్చిమ బెంగాల్ (West Bengal) నిలిచాయి.
ఇండియా జస్టిస్ రిపోర్ట్ అంటే ఏమిటి?
ఇండియా జస్టిస్ రిపోర్ట్ (IJR) అనేది పౌరసమాజ సంస్థల భాగస్వామ్యంతో రూపొందించిన ఒక స్వతంత్ర అధ్యయన నివేదిక. ఇది దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో న్యాయ వ్యవస్థ, పోలీస్ శాఖ, జైలు వ్యవస్థ, లీగల్ ఎయిడ్ (న్యాయ సహాయం) వంటి విభాగాల్లో పనితీరు, పారదర్శకత, సమర్థత, సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించి ర్యాంకింగ్ ఇస్తుంది. ఇది ప్రజలకు వారి రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తోందనే అంశంపై స్పష్టతను కలిగిస్తుంది. పోలీసు మేనేజ్మెంట్, స్టాఫ్ లెవెల్స్, బడ్జెట్ వినియోగం, మహిళా పోలీసుల నిష్పత్తి వంటి అంశాల్లో మన తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానాల్లో నిలిచాయని ఈ నివేదిక వెల్లడించింది.
Top ranking : పెద్ద, మధ్యస్థాయి రాష్ట్రాల స్కోర్ ఇలా..
- తెలంగాణ : స్కోరు 6.48
- ఆంధ్రప్రదేశ్ : స్కోరు 6.44
- కర్ణాటక : స్కోరు 6.19
- ఛత్తీస్‌గఢ్ : స్కోరు 6.02
- మహారాష్ట్ర : స్కోరు 5.61
- ఉత్తరాఖండ్ : స్కోరు 5.50
- పంజాబ్ : స్కోరు 5.26
- ఒడిశా : స్కోరు 5.16
- గుజరాత్ : స్కోరు 5.13
- బీహార్ : స్కోరు 5.04 తక్కువ స్కోరు సాధించిన రాష్ట్రాలు
– ఉత్తరప్రదేశ్ : 4.26
– పశ్చిమ బెంగాల్: 3.36 (చివరి స్థానం)
చిన్న రాష్ట్రాల్లో పోలీస్ ర్యాంకింగ్
సిక్కిం మరోసారి చిన్న రాష్ట్రాల్లో తన అగ్రస్థానాన్ని కాపాడుకుంది. 6.10 స్కోరును ఈ రాష్ట్రం దక్కించుకుంది. అరుణాచల్ ప్రదేశ్ 5.35, మిజోరాం 4.75తో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్ 4.01, మేఘాలయ 3.83, | త్రిపురా 3.58, గోవా 3.38 ర్యాంకులు సాధించాయి.
న్యాయ వ్యవస్థ పనితీరులోనూ తెలంగాణ అగ్రగామి
పోలీసుల పనితీరులో టాప్ స్థానం సాధించిన తెలంగాణ న్యాయ వ్యవస్థ విభాగం (judiciary rankingjudiciary ranking)లో రెండో స్థానం పొందింది. ఈ విభాగంలో కేరళ 7.43 స్కోరుతో మొదటి స్థానంలో ఉంది, తెలంగాణకు 6.91 స్కోరుతో ద్వితీయ స్థానమొచ్చింది. ఆంధ్రప్రదేశ్ 6.68 స్కోరును దక్కించుకుంది. ఇందులోనూ ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ చివరి స్థానాల్లో నిలిచాయి. ఉత్తరప్రదేశ్ 3.56, పశ్చిమ బెంగాల్ 2.45 స్కోర్లు వచ్చాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.