Sarkar Live

Osmania | ఉస్మానియాలో దేశంలో తొలిసారి అరుదైన ఆపరేష‌న్‌..

Rare surgery : హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital (OGH) వైద్యులు ఈ రోజు అరుదైన ఆప‌రేష‌న్ (Rare surgery) చేసి చారిత్ర‌క విజయాన్ని సాధించారు. 37 ఏళ్ల రోగికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జ‌రీ (successful

Osmania General Hospital

Rare surgery : హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital (OGH) వైద్యులు ఈ రోజు అరుదైన ఆప‌రేష‌న్ (Rare surgery) చేసి చారిత్ర‌క విజయాన్ని సాధించారు. 37 ఏళ్ల రోగికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జ‌రీ (successful liver transplant surgery) చేశారు. ఆ రోగి ఒక అరుదైన జన్యు సంబంధిత వ్యాధైన మార్ఫాన్స్ సిండ్రోమ్ (Marfan’s Syndrome)తో బాధ‌ప‌డుతున్నాడు. అంతేకాదు.. అతడు హెపటో పల్మనరీ సిండ్రోమ్ (HPS) అనే తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యతో కూడా బాధపడుతున్నాడు. ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఏకకాలంలో క‌లిగి ఉండటం వైద్యుల‌కు స‌వాల్‌గా మారింది. అలాంటి కేసులో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ (liver transplant surgery)ను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు.

జ‌న్యుప‌ర‌మైన వ్యాధితో బాధ‌ప‌డ‌తుండ‌గా…

మార్ఫాన్స్ సిండ్రోమ్ (Marfan’s Syndrome) అనేది జన్యు (genetic) మార్పులతో ఏర్పడే వ్యాధి. ఇది శరీరంలోని కండరాలు, రక్తనాళాలు, అనేక అంతరాంగ అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని టిష్యూలు బలహీనంగా ఉంటాయి కాబ‌ట్టి శస్త్రచికిత్సలు చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది. అదనంగా హెపటో పల్మనరీ (hepatopulmonary) సిండ్రోమ్ ఉన్న వారికి లంగ్స్‌లో కూడా సమస్యలు ఏర్పడతాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండడం వల్ల వారు సాధారణ జీవనానికి తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఈ రోగికి ఈ రెండు సమస్యలు కలిసివచ్చినందున, అతని పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

Rare liver transplant : రిస్క్ అయినా స‌క్సెస్‌

ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం పెద్ద రిస్క్‌. అయినా ఉస్మానియా ఆస్త్పత్రి వైద్యులు దీనికి సాహసించింది. గ్యాస్ట్రోఎంటరాలజీ హెచ్‌వోడీ డాక్టర్ మధుసూదన్ (Dr Ch Madhusudhan) నాయకత్వంలోని వైద్యబృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. ఇందులో హెపటాలజిస్టులు, పుల్మనాలజిస్టులు, కార్డియాలజిస్టులు , అనెస్తీషియాలజిస్టులు భాగస్వామ్యమయ్యారు. ఈ బహు విభాగాల సమన్వయంతో రోగి పరిస్థితిని ముందుగానే విశ్లేషించి, పూర్తిగా అంచనా వేసి, అన్ని వైద్యపరమైన ముప్పులను గమనించి శస్త్రచికిత్స చేశారు.

Osmania Hospital : స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తూ…

శస్త్రచికిత్స జరిపే ముందు రోగికి గుండె సంబంధిత పర్యవేక్షణ, ఊపిరితిత్తుల పనితీరు, శరీర స్థితిగతులపై విస్తృతంగా పరీక్షలు చేశారు. అతడి శరీరం మార్ఫాన్ సిండ్రోమ్ వల్ల చాలా సున్నితంగా మారింది. దీంతో స‌ర్జ‌రీ సమయంలో టిష్యూ ఫ్రెజిలిటీ, గుండెపోటు ప్రమాదం వంటి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ, వైద్య బృందం ఎంతో నిగ్రహంగా, నైపుణ్యంతో ఆ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఆ తర్వాత రోగిని ఐసియూ (Intensive Care Unit)కి తరలించి, నిరంతర పర్యవేక్షణలో ఉంచారు. శస్త్రచికిత్స తర్వాత అతని శరీర ప్రతిస్పందన సంతృప్తికరంగా ఉండటంతో ఇది ఒక వైద్య విజయం అని డాక్టర్ మధుసూదన్ ప్రకటించారు.

Rare liver transplant : దేశంలోనే తొలి ఆప‌రేష‌న్‌

ఈ త‌ర‌హా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్స జ‌ర‌గ‌డం దేశంలోనే తొలిసారి. మార్ఫాన్ సిండ్రోమ్ (Marfan’s Syndrome) , హెపటో పుల్మనరీ (hepatopulmonary) సిండ్రోమ్ కలిగిన రోగికి లివర్ మార్పిడి చేయడం ఇప్పటివరకు భారత్‌లో ఎక్క‌డా లేదు. ఇది ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌ (Osmania General Hospital) కి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ప్రభుత్వ రంగ వైద్యంలో నూతన నైపుణ్యాలు, సాంకేతికత, సమిష్టి ప్రయత్నం వల్ల ప్రైవేట్ హాస్పిటళ్ల స్థాయిలోనే వైద్య సేవలు అందించగలమని ఇది చాటి చెప్పింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?