Jammu and Kashmir : జమ్మూ కశ్మీర్‌లో దారుణమైన దాడికి పాల్పడిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదుల (Lashkar-e-Taiba (LeT) terrorists )తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల ఇళ్లను భద్రతా బలగాలు తనిఖీ చేయగా భారీ కుట్ర బహిర్గతమైంది. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకోగా అధికారులు శుక్రవారం వెల్లడించారు.
తనిఖీ చేస్తుండగానే పేలుడు
పహల్గాం (Pahalgam) దాడి కేసులో ప్రధాన నిందితుడ9 ఆదిల్ హుస్సేన్ తొకార్ , మరో అనుమానిత ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లలో భద్రతా దళాలు సోదాలు చేశాయి. తనిఖీలు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఇద్దరూ లష్కరే తోయిబా (Lashkar-e-Taiba )కు చెందినవారేనని తెలుస్తోంద. పేలుళ్లలో ఇద్దరి ఇళ్లూ పూర్తిగా ధ్వంసమయ్యాయి. భద్రతా బలగాలు తనిఖీకి వచ్చినప్పుడు పేల్చేందుకు ముందుగానే బాంబులు అమర్చి ఉంచినట్లు అక్కడి దృశ్యాన్ని చూస్తుంటే స్పష్టమవుతోంది.
Jammu and Kashmir : ముమ్మరంగా సోదాలు
ఆదిల్ హుస్సేన్ తొకార్ అనంతనాగ్ జిల్లాకు చెందినవాడు. పహల్గాం (Pahalgam) దాడిలో ఇతడే ప్రధాన నిందితుడు. ఆ దాడిలో కొంతమంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అతడు ఆ దాడిలో నేరుగా పాల్గొన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆసిఫ్ షేక్ త్రాల్ ప్రాంతానికి చెందినవాడు. ఇతను పహల్గాం దాడి కుట్రలో భాగస్వామిగా ఉన్నాడని అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ సంఘటన పట్ల భద్రతా శాఖలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఉగ్రవాదుల స్థావరాలు, సహకారులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
సమయస్ఫూర్తి వల్ల తప్పిన ప్రమాదం
ఈ పేలుళ్లు ఉగ్రవాదుల కుతంత్రాలను మరోసారి ప్రజల్లో భయాందోళన కలిగించాయి. తమ ఇంట్లోనే పేలుడు పదార్థాలు దాచి పెట్టి, తాత్కాలిక ఉగ్ర స్థావరాలుగా మలచిన ఈ చర్యలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. అయితే భద్రతా బలగాలు తనిఖీల్లో ఉన్న సమయంలో ఈ కుట్ర బహిర్గతమైంది. లేదంటే ఈ పదార్థాలు మరిన్ని అమాయకుల ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం ఉండేది. ఈ ఘటనపై ప్రజల నుంచి భద్రతా బలగాలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సమయస్ఫూర్తితో గట్టిగానే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై ఉగ్రవాదుల పై దాడుల విషయంలో భద్రతా వ్యవస్థ మరింత ముందస్తు చర్యలు తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.