Sarkar Live

Varun Tej : గోపీచంద్ ను కాదని వరుణ్ తేజ్ తో..?

డిఫరెంట్ సినిమాలను తీసే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej)మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ఒకే చేసినట్టు తెలుస్తోంది.ఇటీవల వరుణ్ చేసిన మూవీస్ వరుసగా ఫ్లాఫ్ అవుతున్నాయి. భారీ అంచనాలతో క్రేజీ కాంబోలో వస్తున్న మూవీస్ కూడా

Varun Tej

డిఫరెంట్ సినిమాలను తీసే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej)మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ఒకే చేసినట్టు తెలుస్తోంది.ఇటీవల వరుణ్ చేసిన మూవీస్ వరుసగా ఫ్లాఫ్ అవుతున్నాయి. భారీ అంచనాలతో క్రేజీ కాంబోలో వస్తున్న మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaaru )డైరెక్షన్లో వచ్చిన గాండీవధారి అర్జున మూవీ వరుణ్ కెరియర్లో కంచె మూవీలా మంచి పేరు తీసుకొస్తుందని ఫాన్స్ అనుకున్నారు.కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ ని దారుణంగా నిరాశపరిచింది.

తమ హీరోకు సూపర్ హిట్టు ఇస్తాడనుకొని ప్రవీణ్ సత్తారు పై ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వారి అంచనాలను డైరెక్టర్ ఏ మాత్రం అందుకోలేకపోయాడు.ఆ తర్వాత శక్తి ప్రతాప్ సింగ్ (Shakti pratap sing) డైరెక్షన్ లో వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ వరుణ్ కెరీర్ ను దెబ్బతీసింది.ఈ మూవీతోనైనా వరుణ్ తేజ్ బౌన్స్ బ్యాక్ అవుతాడనుకున్నారు. కానీ ఏ మాత్రం ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది.

అంతకుముందు వచ్చిన గని అయినా,ఆ తర్వాత వచ్చిన మట్కా అయినా వరుణ్ తేజ్ కెరియర్ లో చెప్పుకోదగ్గవి కావు. తనకు తగ్గట్టుగా స్టోరీస్ ఎంచుకోవడంలో తడబడుతూ ఆడియన్స్ అంచనాలను ఏమాత్రం రీచ్ కాలేకపోతున్నాడు.ప్రజెంట్ యాక్షన్ జానర్ లో కామెడీ ని టచ్ చేశాడు. మేర్లపాక గాంధీ (merlapaka Gandhi ) డైరెక్షన్లో కొరియన్ కనకరాజు అనే మూవీ తీస్తున్నాడు.

ఆల్రెడీ సెట్స్ పై ఉన్న ఈమూవీ చిత్రీకరణ కూడా కంప్లీట్ చేసుకుంటుంది. ప్రజెంట్ ఒక ఐటమ్ సాంగ్ తీస్తున్నారు. ఈ మూవీ పైనే వరుణ్ తేజ్ ఆశలన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ బిగ్ ప్లాప్ లలో ఉన్న వరుణ్ కామెడీ జానర్ లో మూవీ తీస్తున్నాడు కాబట్టి, అందులోనూ మేర్లపాక గాంధీ తీస్తున్న సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి హిట్టు కొట్టే ఛాన్స్ లు ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వరుణ్ మళ్లీ తన కెరీర్లో దూసుకుపోతాడనడంలో సందేహం లేదు.

గోపి కాదు Varun Tej …

ఈ మూవీ చేస్తుండగానే చాలా కథలు విన్న వరుణ్ తేజ్ జిల్, రాధే శ్యామ్ మూవీస్ తీసిన రాధాకృష్ణ డైరెక్షన్లో మూవీ చేయబోతున్నాడట. ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. రాధాకృష్ణ (radhakrishna)నెక్స్ట్ మూవీ గోపీచంద్ తో ఉంటుందని టాక్ వినిపించింది. కానీ గోపిచంద్ రెండు కొత్త సినిమాలను వేరే వారి డైరెక్షన్ లో ఆల్రెడీ మొదలుపెట్టబోతున్నాడు. ఇక ఇప్పట్లో ఆయనతో మూవీ లేనట్లే. అందుకే నెమ్మదిగా రాధాకృష్ణ వరుణ్ తేజ్ కి స్టోరీ చెప్పి ఒప్పించాడట.

ఈసారి లవ్ స్టోరీ నే…?

ప్రజెంట్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో చేస్తున్న మూవీ కంప్లీట్ చేసుకున్నాక ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్. వరుసగా యాక్షన్ సినిమాలు తీసి ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న వరుణ్ తేజ్ ఇప్పుడు కామెడీ, లవ్ స్టోరీస్ వైపు మొగ్గు చూపిస్తున్నాడట. రాధాకృష్ణ డైరెక్షన్లో వస్తున్న మూవీ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఫిదా లాంటి ఒక మంచి లవ్ స్టోరీ తర్వాత వరుణ్ కెరీర్ లో రాధాకృష్ణ మంచి హిట్ సినిమాను ఇస్తాడని మెగా అభిమానులు అనుకుంటున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ కాంబోపై కొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?