ATM transactions | హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల మేరకు, బ్యాంకులు ఈరోజు నుంచి అంటే మే 1 నుంచి ATM లావాదేవీలకు కొత్త చార్జీలను అమలుచేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ విధించిన కొత్త మార్గదర్శకాలు ఉచిత ATM లావాదేవీలకు పరిమితులు విధించింది. అలాగే, ఉచిత లావాదేవీలు ముగిసిన తర్వాత ఛార్జీలను సవరించింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, వినియోగదారులు ఇప్పుడు వారికి సంబంధించిన బ్యాంకుల నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల నుండి మూడు ఉచిత ATM లావాదేవీలను నిర్వహించవచ్చు. ఇదే మెట్రోయేతర నగరాల్లో ఐదు లావాదేవీలను ఉచితంగా పొందవచ్చు. పరిమితి మించితే వినియోగదారులకు ఛార్జీ విధించబడుతుంది.
ATM transactions : కొత్త చార్జీలు ఇలా..
మార్చి 28, 2025 నాటి RBI నోటిఫికేషన్ లో ఇలా పేర్కొని ఉంది. “ATM ఇంటర్‌చేంజ్ ఫీజు ATM నెట్‌వర్క్ నిర్ణయించిన విధంగా ఉంటుంది. ఉచిత లావాదేవీలకు మించి, ఒక కస్టమర్‌కు ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ. 23 రుసుము వసూలు చేయవచ్చు. ఇది మే 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ఇంకా వర్తించే
టాక్స్ లు, ఏవైనా ఉంటే, అదనంగా చెల్లించాలి. ఈ సూచనలు క్యాష్ రీసైక్లర్ మెషీన్‌లలో (నగదు డిపాజిట్ లావాదేవీలకు కాకుండా) జరిగే లావాదేవీలకు కూడా వర్తిస్తాయి ని పేర్కొంది.”
ఈరోజు నుండి మీ ATM లావాదేవీలు పరిమితిని దాటితే మీ బ్యాంక్ ప్రతి కార్యకలాపానికి రూ. 23 వసూలు చేస్తుంది. మీరు డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా లేదా మీ బ్యాలెన్స్‌ను తనిఖీ చేస్తున్నారా అనే దానితో సంబంధం లేకుండా ప్రతి ట్రాంజాక్షన్ (ATM transactions) కు ఈ రేటు వర్తిస్తుంది. కాగా సవరించిన లావాదేవీ రుసుము గురించి అనేక బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు తెలియజేశాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.