IPL 2025 Suspended News : తాజా నివేదికల ప్రకారం, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య IPL 2025 ను తక్షణమే వాయిదా వేయాలని IPL పాలక మండలి నిర్ణయించింది. ధర్మశాలలో బ్లాక్‌అవుట్ ప్రకటించిన తర్వాత గురువారం పంజాబ్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేయబడింది. అటువంటి పరిస్థితిలో, IPL పాలక మండలి ధర్మశాలలో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది.
ప్రత్యేక రైలులో ఢిల్లీకి క్రికెటర్ల తరలింపు
పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను శుక్రవారం ఉదయం ధర్మశాల నుంచి ఢిల్లీ(Delhi)కి ప్రత్యేక రైలులో పంపించారు. బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, ‘ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకునేలా ధర్మశాల దగ్గర నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం మ్యాచ్ రద్దు చేసి స్టేడియాన్ని కూడా ఖాళీ చేయించామని తెలిపారు. ప్రస్తుతానికి ఆటగాళ్ల భద్రతే అత్యంత ముఖ్యం. పరిస్థితి కారణంగా ఈ రాత్రి మ్యాచ్ కొనసాగించడం సాధ్యం కాలేదని తెలిపారు.
11వ ఓవర్లో ఆగిన మ్యాచ్..
ధర్మశాలలోని HPCA క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గురువారం జరుగుతున్న మ్యాచ్ పంజాబ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ మొదటి బంతి బౌలింగ్ తర్వాత ఆగిపోయింది. మొదట్లో, ఫ్లడ్‌లైట్లలో సాంకేతిక లోపం కారణమని చెప్పారు. కానీ తరువాత భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన తర్వాత, ధర్మశాలలో బ్లాక్‌అవుట్ విధించబడిందని, ఆ తర్వాత మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడైంది. ఫ్లడ్ లైట్లు ఆరిపోయిన తర్వాత, ప్రేక్షకులను స్టేడియం వదిలి వెళ్ళమని కోరారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రేక్షకులను స్టేడియం నుంచి బయటకు వెళ్లమని అభ్యర్థించడం కనిపించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.