Virat Kohli Retires From Test Cricket : భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. గత కొంతకాలంగా జరుగుతున్న పుకార్లు, చర్చలకు ముగింపు పలుకుతూ, కోహ్లీ ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో వీడ్కోలు సందేశాన్ని రాశారు.
Virat Kohli టెస్ట్ కెరీర్..
Virat Kohli Test Career : విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌ల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ కూడా. కోహ్లీ 68 టెస్ట్ మ్యాచ్‌లలో 40 గెలిపించాడు. 2016-2019 మధ్యకాలంలో టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. కెప్పెన్ గా అతడు 43 టెస్ట్ మ్యాచ్‌ల్లో 66.79 సగటుతో 4,208 పరుగులు చేశాడు. అతను 69 ఇన్నింగ్స్‌లలో 16 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు చేశాడు. ఇది అతడి టెస్ట్ క్రికెట్‌లో గొప్ప ఆటగాడిగా నిలిపింది.
రిటైర్మెంట్ గురించి కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో ఇంకా ఇలా రాశాడు – నేను ఈ ఫార్మాట్ నుండి దూరంగా వెళుతున్న కొద్దీ, ఇది సులభం కాదు, కానీ అది సరైనదని అనిపిస్తుంది. నేను దానికి నా సర్వస్వం ఇచ్చాను. కానీ అది నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఇచ్చింది. ఆటకు, మైదానంలో నాతో పంచుకున్న వ్యక్తులకు, దారి పొడవునా నన్ను గమనించిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.. నేను బయలుదేరుతున్నాను. నా టెస్ట్ కెరీర్‌ను నేను ఎప్పుడూ చిరునవ్వుతో తిరిగి చూసుకుంటాను. అని విరాట్ కోహ్లీ పోస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.