Weather updates : తీవ్రమైనఫెంగల్ తుపాను తీరం దాటినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చలి తీవ్రత కూడా తగ్గింది. ఏపీతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వానలు పడుతున్నాయి. ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో ..
Telangana Weather updates : తెలంగాణలో ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో చెదురుమదురు వానలు కూరిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏడో తేదీ వరకు ఇలాంటి వాతావరణం ఉంటుందని చెబుతోంది. ఈనెల 8 నుంచి వాతావరణంలో మార్పులు వొస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగానే నమోదవుతాయ చెప్పింది. ఇక తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. మెదక్‌లో అత్యల్పంగా 16.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది,. నిజామాబాద్ జిల్లాలో 32.9 డిగ్రీలు రికార్డ్ అయింది. సాధారణంగా ఈ సీజన్‌లో నమోదు అయ్యే ఉష్ణోగ్రత కంటే ఐదు నుంచి 10 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో..
andhra Pradesh Weather Updates : ఆంధ్రప్రదేశ్ లో ఫెంగల్ తుపాను ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా 31 మి.మి వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులుతెలిపారు. తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతుందని చెబుతున్నారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, సత్య సాయి, చిత్తూరు, తిరుపతిజిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉంది. ఇక మన్యం, విజయనగరం, విశాఖపట్నం, , కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, పల్నాడు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య,చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.