Sarkar Live

అన్నింటా కాంగ్రెస్ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం – Harish Rao

తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం అన్నింటా విఫల‌మైంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్‌రావు (BRS MLA Harish Rao ) అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం, తీగుల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఆయ‌న ప్రారంభించారు. అలాగే

Kaleshwaram

తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం అన్నింటా విఫల‌మైంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్‌రావు (BRS MLA Harish Rao ) అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం, తీగుల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఆయ‌న ప్రారంభించారు. అలాగే గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంత‌రం హరీశ్ రావు మాట్లాడుతూ..

గ్రామంలో సొంత జాగా కొని, సొంత డ‌బ్బుల‌తో పార్టీ కార్యాల‌యం నిర్మించిన ఘనత తీగుల్ పార్టీ కార్యకర్తలకే దక్కిందని కొనియాడారు. ఇది రాష్ట్రానికి ఆదర్శనీయం. ఈ గ్రామం ఎంతో గొప్పది.
2001లో బిఆర్ఎస్ పార్టీ పెట్టిన నాడు స్థలం కొంటే రజతోత్సవం సందర్భంగా బిల్డింగ్ ప్రారంభించుకున్నం. స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు తీగుల్ గ్రామానిది గొప్ప చరిత్ర. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో ఈ గ్రామం నుంచి కుమ్మరి బాలయ్య, కిష్టాపురం శాంతయ్య, ఆంజనేయులు, మల్లారెడ్డి వంటి వారు ఎందరో జై తెలంగాణ అని ముందుండి పోరాటం చేసారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్నే మార్చేస్తున్నారు. తెలంగాణ తల్లిని మార్చాడు.
ఆయన తెచ్చిన మార్పు తల్లిని మార్చడం. ఉద్యమంలో ఒక తల్లి, అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటుందా? తెలంగాణ తల్లి ఉద్యమానికి స్పూర్తి, ఆ తల్లి దీవెనతో తెలంగాణ సాధించుకున్నాం. రైతు బంధు మార్చుతారా, కల్యాణ లక్ష్మి మార్చుతారా, సచివాలయం తీసేస్తారా, 125 అడుగుల అంబేద్కర్ తీసేస్తారా? చార్మినార్ బొమ్మ తీయడం, కాకతీయుల కాళాతోరణం మార్చడం ఇదేనా నువ్వు చెప్పిన మార్పు అంటే.. కేసీఆర్ ఉన్నపుడు కరెంట్ కష్టాలు లేవు. రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ కిట్టు బంద్ అయ్యింది.
కాంగ్రెస్ పార్టీ అంటేనే కల్లబొల్లి మాటలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసం చేయడం
పింఛన్లు 4వేలు అన్నడు, 15వేల రైతు బంధు అన్నడు, పెండ్లి చేసుకుంటే తులం బంగారం అన్నడు, ఆడోళ్లకు నెలకు 2500 ఇస్తమన్నడు. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచిండు. ఆశపడ్డందుకు బాధ పడే పరిస్థితి వచ్చింది. జన్మల కాంగ్రెస్ కు ఓటు వేయద్దని అంటున్నరు. రేవంత్ రెడ్డి నిజస్వరూపం మూడు నాలుగు నెలల్లోనే బయట పడిందిరియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యింది. ఉన్నపుడు మనిషి విలువ తెలియదు. ఇప్పుడు కేసీఆర్ విలువ అందిరికి అర్థం అవుతోంది. పదేండ్లలో కేసీఆర్ నిలబెడితే, రేవంత్ రెడ్డి ఏడాదిన్నరలో పడగొట్టాడు అని మాజీ మంత్రి హ‌రీష్ రావు విమ‌ర్శించారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?