Sarkar Live

Build Now | బిల్డ్ ‌నౌ యాప్ తో భ‌వ‌నాలు, లేఔట్ల అనుమ‌తులు ఈజీ..

Build Now | భవనాలు, లేఅవుట్ల అనుమతులకు ‘బిల్డ్ ‌నౌ’ పేరుతో కొత్త ఆన్‌లైన్‌ ‌విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ’బిల్డ్ ‌నౌ’ పేరుతో రూపొందించిన యాప్‌తో పాటు, ఆన్‌లైన్‌ విధానాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు మంగళవారం

Build Now

Build Now | భవనాలు, లేఅవుట్ల అనుమతులకు ‘బిల్డ్ ‌నౌ’ పేరుతో కొత్త ఆన్‌లైన్‌ ‌విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ’బిల్డ్ ‌నౌ’ పేరుతో రూపొందించిన యాప్‌తో పాటు, ఆన్‌లైన్‌ విధానాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు మంగళవారం ప్రారంభించారు. సచివాలయంలో బిల్ట్‌ ‌నౌ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పట్టణాభివృద్ధిలో గతంలో లేని విధంగా అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌ ‌బాబు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది జనాభా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్నార‌ని అందుకే ఈ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పిస్తున్నామ‌ని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా నెరవేరుస్తున్నామ‌ని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నాం. స్థిరాస్తి రంగంలో ఇప్పటికీ హైదరాబాద్‌ ‌ప్రథమ స్థానంలో ఉంది. హైదరాబాద్‌ ‌ప్రజలే గృహ రుణాలు అధికంగా తీసుకుంటున్నారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

వేగ‌వంతంగా అనుమ‌తులు

తెలంగాణ ప్రభుత్వం నూతన సమగ్ర భవనాలు, లేఅవుట్ల ఆమోదానికి సంబంధించిన వ్యవస్థ బిల్డ్ ‌నౌ అన్నారు. ఇది అత్యాధునిక ప్రజాపాలన దిశగా ఒక విప్లవాత్మక అడుగు. భారతదేశంలోనే వేగవంతమైన డ్రాయింగ్‌ ‌స్కూట్న్రీ వ్యవస్థ ఇది నిదర్శనమని చెప్పారు. ఈ నూతన వ్యవస్థ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుంద‌ని చెప్పారు. అనుమతులు, డ్రాయింగ్‌ ‌స్కూట్నీ ప్రాసెసింగ్‌ ‌సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. పనితీరులో ఇది ఒక బెంచ్‌ ‌మార్క్ ‌గా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఈ అత్యాధునిక వ్యవస్థ భవన నిబంధనలు, అనుమతులకు సంబంధించి ప్రజల అవసరాలను వేగంగా తీర్చడంతో పాటు విశ్వసనీయంగా, స్నేహపూర్వకంగా ఉంటుంది. ప్రజలు, నిర్మాణదారుల కోసం శక్తివంతమైన, అధునాతన వ్యవస్థగా అభివ‌ర్ణించారు. బహుళ అంతస్తుల భవనాలను కూడా 5 నిమిషాల్లో ప్రాసెస్‌ ‌చేయగల సామ‌ర్థ్యం దీనికి ఉంటుంది. ప్రజలు పలు విభాగాలకు వెళ్లడం, వివిధ పోర్టల్స్ ‌మారే అవసరం లేకుండా అనుమతి ప్ర‌క్రియ అంతా ఒకే చోట పూర్తి చేయగల ఏకీకృత సింగిల్‌ ‌విండో ఇంటర్‌ ‌పీస్‌ ఇదని మంత్రి వివరించారు.

ప్రజలు తమ భవనాలను నిర్మాణానికి ముంది వాస్తవికంగా అగ్మెంటెడ్‌ ‌రియాలిటీ 3డీ విజువలైజేషన్‌ ‌ద్వారా చూడొచ్చు. ప్రతి దరఖాస్తును ధ్రువీకరించి ట్రాక్‌ ‌చేసేందుకు బ్లాక్‌ ‌చైన్‌ ‌టెక్నాలజీ అవకాశం కల్పిస్తుంది. డేటా ఆధారిత పాలనను చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అభివృద్ధి నివేదికను ప్రజల ముందు పెడుతున్నామన్నారు.
రికార్డు స్థాయిలో పట్టణాభివృద్ధి జరిగిందని, హైదరాబాద్‌ ‌పర్‌ ‌క్యాపిటల్‌ ఇన్‌కమ్ 19.3 ‌చొప్పున పెరుగుతుందన్నారు. రియల్‌ ఎస్టేట్‌ ‌రంగంలో హైదరాబాద్‌ ఇప్పటికి మొదటి స్థానంలో ఉందని, గత 15 సంవత్సరాలుగా తెలంగాణ వార్షిక అభివృద్ది రేటు ‌పెరిగిందన్నారు. గృహ సముదాయాల అమ్మకాల్లో కూడా హైదరాబాద్‌ ‌ముందుంద‌ని , హోమ్‌ ‌లోన్స్ అం‌శంలోనూ హైదరాబాద్‌ అ‌గ్రస్థానంలో ఉందని మంత్రి శ్రీధ‌ర్ బాబు అన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, 45 వేల ఉద్యోగాలు ఐటీలో ఇచ్చాం. ప్రస్తుతం 9.7 లక్షల మంది ఐటి ఉద్యోగులు హైదరాబాద్‌ ‌లో పని చేస్తున్నారన్నారు.

See also  Tirumala Stampede : తిరుమలలో తీవ్ర విషాదం.. క్యూ లైన్లో తొక్కిసలాట, నలుగురు మృతి

అంతేకాకుండా..’అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐటీ సెంటర్లు హైదరాబాద్‌ ‌లో ఉన్నాయి. రాబోయే మూడేళ్ల‌లో 34 మిలియన్‌ ‌స్క్వార్‌ ‌ఫీట్‌ ‌నుంచి 37 మిలియన్ల స్కైర్‌ ‌ఫీట్‌ ఆఫీస్‌ ‌స్పెస్‌ ‌కావాలని అడుగుతున్నారు. 1.37 వేల రెసిడెన్షియల్‌ ‌యూనిట్లు కావాలని కోరుతున్నారు. 23 శాతం బిల్డింగ్‌ ‌పర్మిషన్స్ అధికంగా ఇచ్చాం. హైదరాబాద్‌ ‌నగరం ప్రపంచంలోని ఐదు నగరాల్లో ఒకటిగా నిలిచిందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.

One thought on “Build Now | బిల్డ్ ‌నౌ యాప్ తో భ‌వ‌నాలు, లేఔట్ల అనుమ‌తులు ఈజీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

తాజా వార్తలు

Categories

నేషనల్ న్యూస్

Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!

Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!

PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర

PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర

Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌

Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌

Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్

Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : సింగపూర్‌ కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ గ్రూప్…
Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌

Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌

Indian Economic Survey : ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భార‌త్‌ అవ‌త‌రించ‌నుందని యునైటెడ్ నేషన్స్…
Bank Holiday 2025 : కొత్త సంవత్సరంలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..

Bank Holiday 2025 : కొత్త సంవత్సరంలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..

Bank Holiday 2025 : దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం,తోపాటు బ్యాంకులు అనేక కొత్త పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. అయితే…
Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..

Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..

Ballo Village | అది ఒక‌ ఆద‌ర్శ గ్రామం. ఆ పంచాయ‌తీ తీసుకొనే నిర్ణ‌యాలు వినూత్నం.. స్ఫూర్తిదాయకం. అక్క‌డి ప్ర‌జ‌లందరిదీ…
error: Content is protected !!