Sarkar Live

Surya 26 OTT Deal : సూర్య కొత్త సినిమాకు భారీ ఓటీటీ డీల్..!

Surya 26 OTT Deal : కంగువా మూవీతో భారీ ఫ్లాప్ చవిచూసిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya)వెంటనే రెట్రో (retro) మూవీ రిలీజ్ చేశాడు. ఈ మూవీపై సూర్య ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. రిలీజ్ అయిన ఫస్ట్

Surya 26 OTT Deal

Surya 26 OTT Deal : కంగువా మూవీతో భారీ ఫ్లాప్ చవిచూసిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya)వెంటనే రెట్రో (retro) మూవీ రిలీజ్ చేశాడు. ఈ మూవీపై సూర్య ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. రిలీజ్ అయిన ఫస్ట్ డే నే మిక్స్ డ్ టాక్ తెచ్చుకోగా ఫుల్ రన్ లో కూడా అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు.

కార్తీక్ సుబ్బరాజు (Kartik subbaraju)డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తమిళ్ లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగులో మాత్రం ఓ మోస్తారుగా ఆడి టాలీవుడ్ సూర్య ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ప్రజెంట్ సూర్య 45వ సినిమాగా బాలాజీ(balaji) డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే 26వ సినిమాను వెంకీ అట్లూరి (venky atloori)డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తొందరలోనే సెట్స్ పైకి కూడా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ మూవీ ఓటీటీ డీల్ దాదాపు 85 కోట్లకు కుదిరిందని టాలీవుడ్ టాక్. మూవీ సెట్స్ మీదకు రాకముందే ఇంత భారీ డీల్ కి కుదరడం చూస్తే ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థమవుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో(Sitara entertainment bannar) సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న మూవీ కావడంతో పక్కా ఆడియన్స్ ను మెప్పించేలా ఉంటుందని టాక్ వినబడుతోంది.

సూర్య స్ట్రెయిట్ తెలుగు సినిమా..

ఈ మూవీ పక్కా సూర్య కెరీర్ లో మంచి మూవీ గా నిలిచిపో తుందనడంలో సందేహం లేదని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. వెంకీ అట్లూరి తన పంథా మార్చుకుని ధనుష్ తో సార్, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్, కోలీవుడ్ లను తన వైపుకు తిప్పుకున్నాడు. ఎప్పటి నుండో సూర్యకు స్ట్రెయిట్ గా తెలుగులో సినిమా చేయాలని కోరిక. మంచి ఫామ్ లో ఉన్న వెంకీ చెప్పిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

అందరి ఫోకస్ ఈ మూవీ పైనే…

ఇది కూడా అందరిని ఆలోచింపజేసే కథ అని తెలుస్తోంది.ఇక తన సినిమాలకు అదిరిపోయే పాటలు ఇస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ నే (GV Prakash Kumar)ఈ మూవీకి కూడా తీసుకున్నాడు.ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలెట్టారు.హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఓటీటీ డీల్ 85 కోట్లకు కుదరడం మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ వార్తతో సూర్య ప్రజెంట్ సెట్స్ పై ఉన్న మూవీ కంటే కూడా ఈ మూవీపై అందరి ఫోకస్ పడిందని చెప్పొచ్చు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?