హనుమకొండ : క్వారీ యజమాని మనోజ్ రెడ్డిపై బెదిరింపు కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) కి కాజీపేట రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించారు.
అయితే అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పీఎస్ దగ్గర హైడ్రామా కొనసాగింది. క్వారీ యజమాని మనోజ్ రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు. మరోవైపు.. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్‌ఎస్ లీగల్ టీం వాధించింది. మొదట ఎఫ్‌ఐఆర్‌లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ లాయర్ వాదించారు. 308 సెక్షన్ 4ని తర్వాత మార్ప్ చేయడంతో నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారని లీగల్ టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున పాడి కౌశిక్ రెడ్డికి రిమాండ్ విధించవద్దని.. లీగల్ టీం వాదించింది. ఇరు వాదనలు విన్న కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) కి ఊరట లభించింది. కౌశిక్‌రెడ్డి రిమాండ్‌ను తిరస్కరించిన న్యాయస్థానం అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వరంగల్ ఎంజీఎంలో వైద్య పరీక్షల అనంతరం కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపర్చారు. 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కౌశిక్‌రెడ్డి తరఫు అడ్వొకేట్ వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న జడ్జీ కౌశిక్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.