Sarkar Live

Hanumakonda | వైబ్రాంట్ మాయాజాలం..

Hanumakonda : విద్యను వ్యాపారంగా మార్చుకోవడంలో ఆ యాజమాన్యం సక్సెస్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అకాడమీ పేరుతో హన్మకొండ లో ఎంట్రీ ఇచ్చిన సదరు అకాడమీ యాజమాన్యం విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా మరో అడుగు ముందుకేసి ఇంటర్మీడియట్ కళాశాలలు

Hanumakonda
  • నిబంధనలకు పాతర.. అడ్మిషన్ల జాతర…
  • అకాడమీ మాటున జూనియర్ కాలేజ్ లు నిర్వహిస్తున్న యాజమాన్యం
  • అడ్మిషన్లు వైబ్రాంట్.. సర్టిఫికేట్ లు మరో కళాశాల నుండి?
  • విద్యాశాఖ గప్ చుప్ వెనుక వైబ్రాంట్ పలుకుబడి?

Hanumakonda : విద్యను వ్యాపారంగా మార్చుకోవడంలో ఆ యాజమాన్యం సక్సెస్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అకాడమీ పేరుతో హన్మకొండ లో ఎంట్రీ ఇచ్చిన సదరు అకాడమీ యాజమాన్యం విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా మరో అడుగు ముందుకేసి ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తోంది. పదుల సంఖ్యలో పిఆర్వోలను ఏర్పాటు చేసుకొని తమ మాయాజాలం (ఐఐటీ జేఈఈ నీట్ తదితర) తో విద్యార్థుల తల్లిదండ్రులను మాయ చేస్తూ అడ్మిషన్ల జాతర నిర్వహిస్తోంది.అసలు విషయం ఏమిటంటే ఎలాంటి అనుమతి లేకుండా హన్మకొండ నగరంలో వైబ్రాంట్ యాజమాన్యం బహిరంగంగా మూడు బ్రాంచీలు ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తున్నా, హన్మకొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు మాత్రం గప్ చుప్ గా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ గప్ చుప్ వెనుక వైబ్రాంట్ యాజమాన్య పలుకుబడి ఉన్నట్లు ఆరోపణలు లేకపోలేదు.

అడ్మిషన్లు వైబ్రాంట్… సర్టిఫికెట్లు మరో కాలేజ్ నుండి..

గత విద్యాసంవత్సరం వైబ్రాంట్ కాలేజ్ లో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు ఓ వింతైన అనుభవం ఎదురైనట్లు తెలిసింది. విద్యార్థులు అడ్మిషన్లు పొందింది, ఫీజులు చెల్లించింది,పాఠాలు విన్నది అంతా వైబ్రాంట్ కాలేజ్ లోని కానీ వారు పరీక్షలు రాసింది, సర్టిఫికేట్ లు పొందింది మాత్రం హన్మకొండ నగరంలోని మరో కాలేజి నుండి అని సమాచారం. అసలు వైబ్రాంట్ కు అనుమతి లేకున్నా యాజమన్యం ఎందుకు గత విద్యాసంవత్సరం అడ్మిషన్లు తీసుకున్నది, మళ్ళీ వేరే కాలేజ్ ను ఎందుకు వేడుకొని నయానో బయానో ఒప్పించి, వాళ్ళ విద్యార్థులకు వీళ్ళ కాలేజ్ నుండి పరీక్షలు రాపించి, సర్టిఫికేట్ లు ఇప్పించింది అంటే విద్యను వ్యాపారం చేసుకోవడం కోసమే అని చెప్పకతప్పదు.

అంతా తెలుసు.. అయినా మౌనం?

హన్మకొండ నగరం (Hanumakonda) లో యథేచ్ఛగా వైబ్రాంట్ కాలేజి యాజమాన్యం ఎలాంటి అనుమతి లేకుండా మూడు బ్రాంచీలు ఏర్పాటు చేసి విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల జాతర నిర్వహిస్తోంది. ఇప్పటికే పిఆర్వో వ్యవస్థ ద్వారా పెద్దఎత్తున అడ్మిషన్లు కూడా తీసుకుంటున్నారు. సదరు యాజమాన్యం వేధింపులకు గత విద్యాసంవత్సరం లో ఓ విద్యార్థి ఆత్మహత్య సైతం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.వైబ్రాంట్ కాలేజి కి అనుమతి లేదని, ఆ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటున్నారని తెలిసినప్పటికీ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు మౌనంగా ఉంటున్నారు.విద్యాశాఖ అధికారుల మౌనం వెనుక వైబ్రాంట్ పలుకుబడి ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి వైబ్రాంట్ కాలేజి పై హన్మకొండ డిఐఈవో ఎలా స్పందిస్తారో చూడాల్సిందే..


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?