ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు పెద్దపులి (Tiger) సంచరిచడం కలకలం రేపుతోంది. పులి తిరుగుతోందని తెలియడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల కోసం పంట చేన్లలోకి వెళ్లేందుకు వణికిపోతు న్నారు. తాజాగా బోథ్ మండలం రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి దర్జాగా నడుచుకుంటూ వెళుతుండగా అటుగా వెళుతున్న కొందరు యువకులు గుర్తించారు. పులుల సంచారంపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
కాగా బోథ్ మండల సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు నిర్ధారణ కూడా అయింది. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పెద్దపులి కనిపించింది. దానికి రెండేండ్ల వయసు ఉంటుందని అధికారులు చెబుతుననారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. త్వరలో దానిని పట్టుకుంటామని వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    