రూ.21వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి..
Nirmal News | నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గోడిసెర్యాల గ్రామ పంచాయతీ సెక్రటరీ (Panchayat Secretary) శివకృష్ణ లంచం (Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు (ACB Trap) పట్టుబడ్డాడు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
గోడిసెర్యాల గ్రామానికి చెందిన జి.రాజేశం గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసుకోవడానికి గాను పంచాయతీ కార్యదర్శి వద్ద అనుమతి కోరాడు. దీంతో కార్యదర్శి శివకృష్ణ 12 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో రాజేశం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం గోడిసెర్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ACB అధికారులకు ఇలా ఫిర్యాదు చేయొచ్చు
ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.