Odisha Stampede : ఒడిశాలోని చారిత్రాత్మక నగరం పూరీలో జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుండిచా ఆలయం వద్ద భక్తులు పెద్దఎత్తున గుమిగూడడంతో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
ఒడిశాలోని పూరిలో రథయాత్ర సందర్భంగా గుండిచా ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట (Puri Stampede ) కారణంగా పెద్ద ప్రమాదం సంభవించింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఒడిశాలోని పూరిలో జరిగిన రథయాత్రలో ఈ ప్రమాదం ఆదివారం ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది.
పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ ఎస్ స్వైన్ మాట్లాడుతూ, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వందలాది మంది భక్తులు ఆలయం సమీపంలో గుమిగూడినప్పుడు ఈ సంఘటన జరిగిందని చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన చెప్పారు. మృతులను బోలాఘర్‌కు చెందిన బసంతి సాహు, బాలిపట్నకు చెందిన ప్రేమకాంత్ మొహంతి, ప్రవతి దాస్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    