- మాయమాటలతో బురిడీ కొట్టిస్తూ అడ్మిషన్ల దందా..
- అకాడమీ పేరుతో బోర్డు.. అక్రమంగా జూనియర్ కాలేజీ నిర్వహణ
- మరో కళాశాల నుండి హాల్ టికెట్లు వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాకే అడ్మిషన్లు
Hanmkonda | హన్మకొండ జిల్లా కేంద్రంలో అకాడమీల పేరుతో విచ్చలవిడిగా అనుమతి లేకుండా ఇంటర్మీడియట్ కళాశాలలు (Illegal Junior college) పుట్టుకొస్తున్నాయి. అలాంటి జాబితాలోకే వస్తుంది ఈ “వేదాంతు “కాలేజీ.అనుమతి లేకున్నా అడ్మిషన్లు తీసుకుంటూ ఇంటర్మీడియట్ కళాశాల నిర్వహిస్తున్న వేదాంతు (Vedantu college ) యాజమాన్యం, జిల్లాలో తాము కార్పోరేట్ విద్యనందిస్తామని ప్రచారం చేసుకుంటూ అడ్మిషన్ల దందా జోరుగా కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ పేరుతో బోర్డ్ పెట్టిన సదరు యాజమాన్యం విద్యాశాఖ (Education Department) నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ కాలేజి నిర్వహిస్తూ మధ్యతరగతి తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకొని వారికి మాయమాటలు చెప్తూ వారి పిల్లలను కార్పోరేట్ విద్య పేరుతో మాయచేస్తున్నట్లు సమాచారం.
Illegal Junior college : అకాడమీ పేరుతో బోర్డు…
హన్మకొండ (Hanmakonda) నగరంలోని లోకల్ బస్ డిపో కు దగ్గర్లో “వేదాంతు” యాజమాన్యం ఓ కమర్షియల్ కాంప్లెక్స్ లోని ఓ ఫ్లోర్ ని అద్దెకు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజి (Vedantu Junior College ) నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఐఐటీ, జేఈఈ, నీట్ పేర అకాడమీ అంటూ బోర్డు పెట్టిన సదరు యాజమాన్యం విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కి ఇంటర్ కళాశాల నిర్వహిస్తున్నట్లు సమాచారం.అసలు విషయం ఏమిటంటే ఈ కాలేజీకి అనుమతి లేదు కాబట్టి గుర్తింపు ఉన్న ఏదైనా కాలేజి నుండి విద్యార్థులను పరీక్షలు రాసే విధంగా ఆ కాలేజి యాజమాన్యం తో ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకున్నాకే “వేదాంతు” అడ్మిషన్లు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
1 Comment
[…] నిర్వహిస్తున్న వైనంపై సోమవారం “అనుమతి లేని వేదాంతు“అనే శీర్షికన సర్కార్ లైవ్ కథనం […]