తెలంగాణ బీజేపీ (Telangana BJP) లో అంతర్గత విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh ) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్ చేసి రాజాసింగ్ పలు విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే.. ఈ విషయంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ..‘రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని, రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటు వేసి ఎన్నుకోవాలని, అంతేకానీ, పార్టీలో మావాడు, మీవాడు అంటూ నియమిస్తుంటే పార్టీకి నష్టం వస్తుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ఎన్నిక నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.
అంతకుముందు కూడా రాజాసింగ్ (Raja Singh ) ఓ వీడియో విడుదల చేశారు. అందులో రాజాసింగ్.. ‘నన్ను అధ్యక్షుడిగా చూడాలని చాలా మంది కార్యకర్తలు కోరుకుంటున్నారని వెల్లడించారు. తనను అధ్యక్షుడిగా నియమిస్తే.. పార్టీలో గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తానని, గోరక్షణకు పాటుపడే కార్యకర్తలకు రక్షణగా నిలబడతానని పేర్కొన్నారు.
Raja Singh : బీజేపీకి రాజీనామా?
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి అందజేసినట్లు ఆయన సోమవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.