హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ (Online Betting Apps) కుటుంబాల్లో పచ్చని కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. బెట్టింగ్ లకు అలవాటు పడిన ఓ వ్యక్తి తన తండ్రినే దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
వనపర్తిలోని తన స్థలాన్ని విక్రయించగా వచ్చిన 6 లక్షల రూపాయలను హనుమంత్ నాయక్ (38) ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన ఆయన కుమారుడు రవీందర్ నాయక్.. ఇంట్లో ఉంచిన ఆ డబ్బు నుంచి రూ.రెండున్నర లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్ (Online Betting) లో పెట్టి నష్టపోయాడు.
కాగా కొన్ని రోజులుగా తండ్రి ఆ డబ్బు గురించి నిలదీయగా రవీందర్ తన స్నేహితుడికి అవసరం ఉంటే ఇచ్చానని బుకాయిస్తూ వచ్చాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన స్నేహితుడు డబ్బులు తిరిగి ఇస్తున్నాడని తండ్రి హనుమంత్ నాయక్‌ను నమ్మించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ తండ్రిని కత్తితో గొంతులో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం రవీందర్ తన బావ రమేష్ నాయక్‌కు ఫోన్ చేసి తండ్రి హనుమంత్ నాయక్ చనిపోయాడని తెలిపాడు అక్కడికి వెళ్లి చూసిన కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో రమేష్ నాయక్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టి నిందితుడు రవీందర్ నాయక్‌ను అరెస్టు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.