Sangareddy News : సంగారెడ్డి జిల్లా కంది మండలం చెరియాల్ (Cheriyal) వద్ద NH-65 పై వేగంగా వస్తున్న లారీ ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ కారును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఎస్సై ప్రాణాలు కోల్పోడారు. వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి పట్టణం (Sangareddy City) లోని చాణిక్యపురి కాలనీలో ఉంటున్న రాజేశ్వర్ (59) ఫిల్మ్ నగర్ (Film nagar) పోలీస్ స్టేషన్‌లో SIగా పనిచేస్తున్నారు. బల్కంపేట బోనాలు ఉత్సవాల్లో విధులను ఆయనకు అప్పగించారు. దీంతో రాజేశ్వర్ తన విధులను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి బయలుదేరాడు. ఈక్రమంలో చేరియాల్ వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గంట తర్వాత మరణించారు. రాజేశ్వర్ వారం క్రితం ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో చేరారని, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది . రాజేశ్వర్ 1990లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.