సంభాల్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) జరిగింది. జెవానై గ్రామంలో పెండ్లి బృందంతో వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి ఓ కళాశాల గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు (24) సహా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులందరిని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జెవానై కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రానికి తరలించారు.
ప్రధాని మోదీ సంతాపం
కాగా, సంభాల్ (Sambhal)లో వరుడితో పాటు ఎనిమిది మంది మరణించిన ప్రమాదం (Road Accident)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని ఎక్స్ (x) లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల సాయం అందజేస్తామని ఆయన ప్రకటించారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.