బ్యాంకింగ్, బీమా, బొగ్గు గనులు, తపాలా, నిర్మాణ రంగాల్లో సేవలకు అంతరాయం
Bharat Bandh LIVE updates : దేశవ్యాప్తంగా బుధవారం (జూలై 9) ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చాయి. దీనికి దాదాపు 10 కేంద్ర కార్మిక సంఘాల కూటమి, అనేక రైతు సంఘాలు మద్దతు ఇచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న “కార్పొరేట్ అనుకూల” విధానాలను నిరసిస్తూ పలు సంఘాలు ఈ సమ్మెను నిర్వహిస్తున్నాయి. బ్యాంకింగ్, బీమా, బొగ్గు గనులు, తపాలా, నిర్మాణ రంగాల వంటి పబ్లిక్ సర్వీస్ విభాగాలకు చెందిన 25 కోట్ల మందికి పైగా కార్మికులు నేటి దేశవ్యాప్త సమ్మె (భారత్ బంద్)లో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న “కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు”పై నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈ బంద్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కి చెందిన అమర్ జీత్ కౌర్ మాట్లాడుతూ, “25 కోట్ల మందికి పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొననున్నారని తెలిపారు. రైతులు, గ్రామీణ కార్మికులు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారని చెప్పారు. మరోవైపు సంప్రదాయ రంగాలు, అసంఘటిత రంగాలకు చెందిన కార్మిక సంఘాలు సమ్మెకు సన్నాహాలు ప్రారంభించాయి.
Bharat Bandh : కార్మిక సంఘాల డిమాండ్లు ఏమిటి..?
- నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి.
- ఖాళీగా ఉన్న అంగీకృత పోస్టులపై నియామకాలు చేపట్టాలి.
- కొత్త ఉద్యోగాలను సృష్టించాలి.
- ఎంజీఎన్ఆర్ఇజీఏ కూలీల పనిదినాలు, పారితోషికం పెంచాలి.
- పట్టణ ప్రాంతాలకు కూడా ఇలాంటి ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలి.
కాగా అధికారిక, అనధికారిక రంగాలలోని సుమారు 25 కోట్లకు పైగా కార్మికులు ఈ భారత్ బంద్ (Bharat Bandh ) లో పాల్గొననున్న నేపథ్యంలో ప్రజా సేవలకు ప్రభావితం కానున్నాయి. పారిశ్రామిక ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, ప్రధాన రాష్ట్ర రాజధానులలో నిరసన ప్రదర్శనలు జరిగే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.