Rainy Season Diseases | వర్షాకాలానికి వచ్చిందంటే చాలు ఇంట్లో ఒక్కొక్కరిగా విషజ్వరాలు అంటుకుంటాయి. జ్వరంతో మొదలై జలుబు, దగ్గు తీవ్రతరమై మంచం పడతారు. ఈ వర్షాకాలం వస్తూ వస్తూ తనతో పాటు ఎన్నో రకాల వ్యాధులను వెంటతీసుకొని వస్తుంటుంది. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యూ వంటి జ్వరాలు వ్యాపిస్తుంటాయి. ఇది సాధారణంగా 8-10 రోజుల పాటు వేధిస్తుంటుంది. ఇందులో డెంగీతో ప్రాణాపాయం కూడా కలగవచ్చు. ఇది ఏడిస్ దోమలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. అయితే చాలా వరకు డెంగ్యూ లక్షణాలు సాధారణ జ్వరాన్ని పోలి ఉండడంతో మొదట్లో గుర్తించడం కష్టంగా ఉంటుంది. అయితే నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో అది ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.

Rainy Season Diseases : తెలంగాణ వ్యాప్తంగా విష జ్వరాలు
వర్షాకాలం మొదలవడంతోనే హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వైరల్ జ్వరాలు, ముఖ్యంగా డెంగ్యూ, విజృంభించింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా కేసులు నమోదువుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులతో నిండిపోతున్నాయి.
దోమల నివారణకే కీలకం..
భారీ వర్షం, నిలిచిపోయిన మురుగునీటి కాలువలు, కుంటలు, మూత లేని కంటైనర్లు దోమలకు అనువైన సంతానోత్పత్తి ప్రదేశాలు. ముఖ్యంగా మునిసిపల్ పట్టణాలలో. అన్ని వయసుల వారు దీని బారిన పడుతున్నారు. జూన్‌లో నిజామాబాద్‌లో 25 డెంగ్యూ కేసులు, జూలై 8 వరకు మరో 15 కేసులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఇలా జాగ్రత్తపడాలి..
సాధారణంగా దోమలు సాయంత్రం తర్వాత రాత్రివేళల్లో తమ ప్రతాపాన్ని చూపుతాయి. కానీ డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే ప్రమాదకరమైన ఏడిస్ దోమలు పగటిపూట కుడతాయి. ఇవి ప్రధానంగా మురుగు నీటిలోనే వృద్ధి చెందుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఇవి ఎక్కువగా ఉదయం వేళల్లో 7 నుండి 9 గంటల సయమం వరకు, అలాగే సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య కుడతాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట నీటి ఉపరితలంపై గుడ్లను పొదుగుతాయి. డెంగ్యూ వైరస్ సోకిన రోగిని కుట్టిన తర్వాత దోమ ఆ వైరస్‌ను మోసుకెళ్లి ఆరోగ్యంగా ఉన్న మరో వ్యక్తిని కుట్టినప్పుడు అతడికి సైతం డెంగీ వ్యాపిస్తుంది. ఇంటి పరిసరాలలో దోమలు వృద్ధి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

దోమల తెరలే ఉత్తమం..
ఇండ్లలో దోమ తెరల ద్వారా దోమల నుంచి రక్షణ పొందచ్చు. గతంలో మంచాలకు ప్రత్యేకంగా తెరలను కట్టి ఆరోగ్యాలను కాపాడుకునేవాళ్లం. కానీ ప్రస్తుత ఆధునిక యుగంలో తలుపులు, కిటికీలు వెంటిలేటర్లకు అన్ ప్లాస్టీసైజ్‌డ్ పాలీ వినైల్ క్లోరైడ్ (యూపీవీసీ), వుడ్ ప్లాస్టిక్ కాంపోజిట్(డబ్ల్యూపీసీ) ఫ్రేమ్‌లతో కూడిన జాలీలను అమర్చుకుంటున్నారు.
గుమ్మాలకు తలుపుతో పాటు జాలీతో కూడిన అదనపు తలుపులు అమరుస్తున్నారు. కిటికీలకు కూడా మూడు వరుసలతో కూడిన అటూ ఇటూ కదిలే ఫ్రేమ్‌లు పెడుతున్నారు. అందులో రెండు అద్దాల ఫ్రేమ్‌లతో పాటు దోమలు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా జాలీతో కూడిన తలుపులు ఉంటున్నాయి. ఉపయోగిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.